తెలంగాణ

రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, డిసెంబర్ 28 : రాష్ట్రంలో గత మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అస్తవ్యస్త పాలన చేస్తున్నారని అభివృద్ధిలో అడుగు కూడా ముందుకు వేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లో జరుగుతున్న సూర్యాపేట జిల్లా ప్రథమ మహసభలలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఎస్సీలకు 3 ఎకరాలు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆచరణకు నోచుకోలేదని బిసి, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం మరిచారని అన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన, ఏక కుటుంబ పాలన సాగుతున్నదని మతవాదులకు మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. శాతవాహన కళాశాలలో విద్యార్థులు మను ధర్మ శాస్త్రం పుస్తకాలు తగులబెడితే వారిపై దాడులు చేస్తున్నారని అన్నారు. హిందూమతం వారే నిజానికి మను ధర్మశాస్త్రం తగులబెట్టాలని దళితులను, శూద్రులను అవమానపరిచే మనుశాస్త్రం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. బీజేపీ, ఆర్‌యస్‌యస్ వారు విద్యార్థులపై దాడులకు పాల్పడుతుంటే టీఆర్‌యస్ మద్దతు ఇస్తున్నదని దళిత ప్రొపెసర్ సుజాతపై కేసు పెట్టాలని యత్నిస్తున్నారని అన్నారు. గత 3 సంవత్సరాలుగా బీసీల సబ్‌ప్లాన్ ప్రభుత్వం తీసుకురాలేదని, గొర్రెలు, చేపలు పెద్ద కుంభకోణాలని, ఎంబీసీలంటే ఏ కులాలో కూడా నిర్ధారణ చేయలేదని అన్నారు. ఎస్టీలకు అటవీ చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకుండా వారి భూములను కూడా ప్రభ్వుం లాక్కొంటున్నదని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంకు వెళ్లాలంటే సీఎంకు భయం పట్టుకుందని సైన్స్ కాంగ్రెసు సభను వీసీ ద్వారా వాయిదా వేయించారని చేజారి మణిపూర్‌కు పోయిందని అన్నారు. కోదండరామ్ సభలు పెట్టకుండా అరెస్టులు, మంద కృష్ణ అరెస్టు జైల్లో పెట్టడం, బెయిల్ కూడా ఇవ్వకుండా చేయడం ప్రభుత్వ నిరంకుశానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్‌కు 31 పార్టీలు అంగీకరించాయని సీపీఐ, కోదండరామ్‌తో చర్చలు జరుపుతున్నామని టీఆర్‌యస్, కాంగ్రెసు ప్రభుత్వాల వల్ల ప్రజల బతుకులు బాగుపడవని వీరభద్రం అన్నారు. జెండాల మార్పిడి తప్ప పద్ధతులు, విధానాలు మారలేదని వామపక్షాలు, సామాజిక శక్తులతో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, పులిచింతల వెంకటరెడ్డి, బి వెంకట్, జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.