తెలంగాణ

ఆమోదమే ఆలస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటైన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నాల్గవ విడత చెరువుల పునరుద్ధరణ పనుల ప్రతిపాదనల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం నుండి పరిపాలన ఆమోదం లభించడమే తరువాయి టెండర్ల ప్రక్రియను చేపట్టి పనులను ప్రారంభించేందుకు జిల్లాల యంత్రాంగం సన్నద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,652 చెరువులుండగా మూడు విడతల్లో 2,736చెరువులకు పరిపాలన అమోదం పొంది 2,705చెరువుల పునరుద్ధరణను 567కోట్లతో చేపట్టారు. వీటిలో ఇప్పటిదాకా 352కోట్లతో 1755చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. తద్వారా లక్షా 37వేల 783ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి మెరుగైంది. ప్రస్తుతం జనవరి నుండి చేపట్టాల్సిన నాల్గవ విడత మిషన్ కాకతీయలో భాగంగా మరో 642చెరువుల పునరుద్ధరణ పనులకు 377.20కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా తద్వారా మరో 60,473ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి మెరుగవ్వనుంది. మొదటి నుండి కూడా మిషన్ కాకతీయలో ఉమ్మడి నల్లగొండ జిల్లా యంత్రాంగం ప్రతిపాదనల సమర్పణలో రాష్ట్రంలోనే అగ్రగామిగా కొనసాగుతుండగా నాల్గవ విడతలో సైతం పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించడం విశేషం. ఈ దఫా మరో 40చెక్ డ్యాంల నిర్మాణాలకు సైతం ప్రతిపాదనలు పంపించారు. నాల్గవ విడత మరమ్మతులు చేపట్టాల్సిన చెరువులకు సంబంధించి ప్రభుత్వం నుండి పరిపాలనా ఆమోదం లభించగానే టెండర్లు పక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు ఇరిగేషన్ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది. నాల్గవ విడతలో నల్లగొండ డివిజన్‌లో 131చెరువుల పునరుద్ధరణకు 119.24కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. దేవరకొండ డివిజన్‌లో 118చెరువులకు గాను 67కోట్లతో, భువనగిరి డివిజన్‌లో 217చెరువులకు 114కోట్ల 50లక్షలతో, సూర్యాపేట డివిజన్‌లో 176చెరువులను 77కోట్ల 15 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు.
పెండింగ్ పనుల పూర్తికి కసరత్తు..
మిషన్ కాకతీయ నాల్గవ విడత పనులకు సిద్ధమవుతున్న తరుణంలో మూడో విడతలో చేపట్టిన 838చెరువులకు కేవలం 88చెరువులే పూర్తి కావడంతో వీటి పనుల్లో వేగం పెంచేందుకు ఇరిగేషన్ శాఖ కసరత్తు చేస్తోంది. మొదటి విడతలో 807చెరువుల పునరుద్ధరణ పనులను 167.74కోట్లతో చేపట్టి 164.85 కోట్లతో 802 చెరువుల పనులు పూర్తి చేశారు. రెండో విడతలో 248.16 కోట్లతో 1060చెరువుల మరమ్మతులు చేపట్టి 171కోట్లతో 864చెరువుల పనులు పూర్తి చేశారు. ఇక మూడో విడతలో 152.30కోట్లతో 838చెరువుల పనులు చేపట్టి కేవలం 15కోట్లతో 88చెరువుల మరమ్మతులు మాత్రమే పూర్తి చేశారు. మూడో విడతలో భారీగా చెరువు పనులు పెండింగ్‌లో ఉండటంపై దృష్టి సారించిన ఇరిగేషన్ శాఖ సమస్యలను గుర్తించి పనుల్లో వేగం పెంచే చర్యలు చేపట్టింది. చెరువుల్లో నీరుండటం, భూసమస్యలు, కాంట్రాక్టర్ల జాప్యం వంటి సమస్యలు చెరువుల పునరుద్ధరణ పనుల పెండింగ్‌కు కారణమవుతున్నాయి.