తెలంగాణ

మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 28: రోజుకో మాటమాట్లాడుతూ మాటలగారడీతో మభ్యపెడుతూ కండువా కప్పిన రోజే టీఆర్‌ఎస్ భవన్‌లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉత్సవాలు నిర్వహిస్తున్న కేసీఆర్‌కు ఆ ఒక్క రోజే పండుగ అంటూ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేస్తున్న తమ అభ్యర్థిని ప్రకటించకుండానే మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతూ నియోజకవర్గ అభివృద్ధి అంటూ మంత్రులను చెక్కర్లు కొట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 30రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థిని ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం వారు ప్రచారం చేస్తున్న విధానాన్ని చూస్తుంటే తాండూర్‌లో ఉన్న బుడంకాన్ మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ఆయననే కొడంగల్‌లో తిప్పుతున్నారని తాండూర్‌లో ముఖం చూపుకుని నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో ఎలా తిరుగుతాడని ఆయన వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారకముందు చేయని అభివృద్ధిని పార్టీ మారిన తర్వాత కొడంగల్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రులు కొడంగల్ నియోజకవర్గంలో చక్కర్లు కొట్టడం చూస్తుంటేహస్యాస్పదంగా ఉందని అన్నారు. కేసీఆర్‌కు కొడంగల్‌లో ఇన్నాళ్లూ లేని అభివృద్ధి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని తనకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో తమ మంత్రుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్లో భాగంగా కోస్గి బస్‌డిపో, కోస్గిలో డిగ్రీకళాశాల భవనం నియోజకవర్గంలోని బోంరాస్‌పేట మండలంలో తండాలను గ్రామపంచాయతీలు చేయాలని గతంలో ప్రతిపాదనలు పంపామని ఈ మూడు అంశాలను పక్కన పెట్టి మేము అభివృద్ధి చేస్తామంటూ టీఆర్‌ఎస్ నాయకులు నియోజకవర్గంలో తిరగడం నవ్వుపుట్టిస్తుందని ఇదంతా చూస్తుంటే ఓటుబ్యాంకు రాజకీయం చేస్తున్నట్టు ఉందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.