తెలంగాణ

చలి చంపేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 28 : ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలులతో ఆదిలాబాద్ జిల్లా గజగజ వణికిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విదంగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో 120 యేళ్ల చరిత్రలోనే అతి తక్కువగా బుధవారం 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా గురువారం తెల్లవారు జామున 3.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ నెల 19న రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.7 డిగ్రీలు నమోదు కాగా గడచిన రెండు రోజుల్లోనే ఈ రికార్డులను పటాపంచలు చేస్తూ 3.0, 3.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. వాతావరణంలో సంభవించిన అనుహ్య మార్పులకు తోడు ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలుల ప్రభావం కారణంగా అడవుల ఆదిలాబాద్ జిల్లాలలో మంచు గడ్డకట్టే రీతిలో చలి తీవ్రత పెరిగి పోతోందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం పది రోజుల్లోనే 3.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతతో రాష్ట్రంలోనే తొలిసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుఅయినట్టు శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా విస్తరించి ఉండటం చుట్టూ నదీ జల ప్రవాహాలు, దట్టమైన అడవులు చలి విజృంబించడానికి మరో కారణం అని చెబుతున్నారు. ఆసిఫాబాద్, బోథ్, ఉట్నూర్‌లలో 3.2 నుండి 3.5 డిగ్రీల కనీష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం.
వేకువజామున ఐదు గంటల నుండి ఉదయం ఏడు గంగల వరకు దట్టమైన పొగమంచు ఆవరించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం పూట పది గంటల వరకు చలిగాలులు విజృంభించడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, కనిష్ట ఉష్ణోగ్రతలతో అనేక అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో రాత్రి, వేకువ జామున వేళల్లో బయటకు వెళ్లకూడదని చర్మ, శ్వాసకోసకు సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.