తెలంగాణ

వైకాపా నేతలకు తెలంగాణ ప్రాజెక్టు పనులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణలో ప్రాజెక్టు పనులను వైకాపా నేతలకు అప్పగించడంతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ల నాటకం ప్రజల ముందు బట్టబయలైందని టిటిడిపి వర్గింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. వైకాపా పార్టీ నేతలకు వేల కోట్ల ప్రాజెక్టు పనులు అప్పగించి, మరోవైపు ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ హరీశ్‌రావు ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్ మధ్య అవగాహన ఉండడం వల్లే సీమాంధ్రకు చెందిన వైకాపా, తెలంగాణకు చెందిన వైకాపా నేతలకు రూ.10 వేల కోట్ల ప్రాజెక్టుల నిర్మాణ పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిజంగా వైకాపా నేత జగన్ తెలంగాణలో ప్రాజెక్టులపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే ప్రాజెక్టు పనులు చేపట్టిన తన పార్టీ నేతలను జగన్ ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఎపిలో టిడిపిలోకి వైకాపా ఎమ్మెల్యేలు వెళ్లిపోతుంటే నానా యాగీ చేసే జగన్, తెలంగాణలో ఇద్దరు టిఆర్‌ఎస్‌లో చేరితే ఎందుకు నోరెత్తడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.