తెలంగాణ

మిషన్ కాకతీయ కోసం భారీగా ఇంజనీర్ల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: మిషన్ కాకతీయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో నీటిపారుదల శాఖలో సిబ్బందిని డిప్యూటేషన్‌పై అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేశారు. మిషన్ కాకతీయ పనులు కొన్ని జిల్లాల్లో నత్తనడకన నడుస్తుండడంతో ఆయా జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి అధికారులను డిప్యూటేషన్‌పై పంపించారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాలతో ఇరిగేషన్ అడ్మిన్ ఇఎన్‌సి విజయప్రకాశ్, ఒఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్ పాండే ఈ మేరకు కసరత్తు చేశారు. ఏయే సర్కిల్స్‌లో అదనపు సిబ్బంది ఉన్నారో పరిశీలించి ఆ సిబ్బందిని నాలుగు నెలల డిప్యూటేషన్‌పై అవసరం అయిన ప్రాంతానికి పంపించారు. కరీంనగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పని చేస్తున్న వారిలో 55 మంది సిబ్బందిని మిషన్ కాకతీయకు బదిలీ చేశారు.
కరీంనగర్‌కు చెందిన ఇద్దరు డిఇఇలను 16 మంది ఏఇఇలను బదిలీ చేశారు. వరంగల్‌కు ముగ్గురు డిఇఇలు, 24 మంది ఎఇఇలను బదిలీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లకు పది మంది ఎఇఇలను డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా హరీశ్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆయన ఇరిగేషన్ ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్ కాకతీయ పనులు పూర్తి కావడానికి సిబ్బంది కొరత ఉందని పలు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లలో సమీక్షా సమావేశంలో ఎస్‌ఇలు, సిఇలు చెబుతున్నందున అదనపు సిబ్బందిని డిప్యూటేషన్‌పై బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు. అదే విధంగా ఇతర జిల్లాల్లోని అదనపు సిబ్బందిని సైతం డిప్యూటేషన్‌పై మిషన్ కాకతీయకు ఉపయోగించుకోనున్నారు. మిషన్ కాకతీయ పథకం అమలును ఆ సంస్థ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. జూన్ 30 నాటికి నిజామాబాద్ జిల్లాలోని 121 గ్రామాలకు మంచినీటిని అందించనున్నట్టు చెప్పారు. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయనే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ భూముల్లో ముందుగానే పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులతో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మిషన్ భగీరథ పనులను ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి సమీక్షించారు.