తెలంగాణ

వరంగల్ జిల్లాలో ఎదురు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ మే 3: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముప్పనపల్లి అడవుల్లో మంగళవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిసింది. వారం రోజులుగా ఏటూరునాగారం అడవిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపట్టాయ. మావోలు ఏటూరునాగారం సమీపంలోని ముళ్లకట్ల బ్రిడ్జి దాటుతున్న సమయంలో పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం. సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. కొందరు మావోలు పోలీసుల నుండి తప్పించుకొని పారిపోగా, ముగ్గురు దొరికినట్లు సమాచారం. ఏటూరునాగారం దళ కమాండరు సడలయ్య అలియాస్ మధుతో పాటు మరో ఇద్దరు మావోలున్నట్టు తెలుస్తోంది. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఎదురు కాల్పులు జరిగిన విషయాన్ని వరంగల్ రూరల్ ఎస్పీ అంబరు కిషోరు ఝా ధ్రువీకరించారు. స్థానికుల కథనం మరోలా ఉంది. 4, 5 తేదీలలో మావోల బంద్ పిలుపు నేపథ్యంలో ఏటూరునాగారం దళ కమాండర్ మధు అలియాస్ ప్రశాంత్ మరో ఇద్దరు కలిసి ఏటూరునాగారం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం సాయంత్రం వచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే దళ కమాండర్ మధు పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరుపగా మార్కెట్ యార్డులో ఉన్న లారీ టైరుకు తగిలింది. ఇంతలో పోలీసుల అప్రమత్తమై మధుతో పాటు మరో ఇద్దరు మావోలను అదుపులోకి తీసుకుని, వారినుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.