తెలంగాణ

సాగర తీరంలో వీరుల స్థూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళితో రాష్ట్రావతరణ వేడుకలు
ఆరంభం కావాలి. హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 12 ఎకరాల స్థలంలో అమరవీరుల స్మారక స్థూపం నిర్మిద్దాం. అడుగు పెట్టగానే మనసుకు సాంత్వన కలిగేంత ప్రశాంత వాతావరణంలో
స్మృతివనం నిర్మిద్దాం. రెండూ తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. ఈ నిర్మాణాలకు స్థలం కోసం సచివాలయానికి సమీపంలో
సాగర తీరాన పర్యాటక శాఖ, బుద్ధపూర్ణిమ, విద్యుత్ తదితర శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలను
వేరే ప్రాంతానికి తరలించండి.

హైదరాబాద్, మే 3: సాగర తీరంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 12 ఎకరాల్లో అమర వీరుల స్థూపం, స్మృతివనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 రాష్ట్రావతరణం రోజున సిఎం కెసిఆర్ వీటికి శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తూ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సిఎం నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 12 ఎకరాల స్థలంలో అమరవీరుల స్మారక స్థూపం, స్మృతివనం నిర్మిస్తారు. సచివాలయానికి సమీపంలో సాగర తీరాన పర్యాటక శాఖ, బుద్ధపూర్ణిమ, విద్యుత్ తదితర శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలను వేరే ప్రాంతానికి తరలించనున్నారు. ఇక్కడ దాదాపు 12 ఎకరాల స్థలంలో అమరవీరుల స్థూపంతోపాటు, అమరుల స్మృతివనం నిర్మాణం, అభివృద్ధి పనుల బాధ్యతను రోడ్లు భవనాల శాఖ ఇఎన్‌సి గణపతిరెడ్డికి అప్పగించారు. హుస్సేన్‌సాగర్ తీరాన అమరవీరుల భారీ స్థూపం నిర్మాణానికి జూన్ 2న శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరుల త్యాగనిరతిని భవిష్యత్ తరాలు స్మరించుకునేలా స్మృతివనం నిర్మించాలని సిఎం అధికారులను ఆదేశించారు. సిఎం కెసిఆర్ తన అధికార నివాసంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వాహణ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం సమీక్ష జరిపారు. వివిధ రూపాల్లో నిక్షిప్తమైవున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి స్మృతివనాన్ని సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ కోసం జీవితకాలం పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను పొందుపర్చాలని చెప్పారు. అత్యద్భుతంగా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి అమరుల స్మృతివనాన్ని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిఎం సూచించారు. ఎవరైనా అక్కడికివెళ్తే స్వాంతన పొందేలా ఉండాలన్నారు. అక్కడి వాతావరణం తెలంగాణ గౌరవం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ముందువైపు బుద్ధుడు, ఆ విగ్రహం వెనుక అంబేద్కర్ ఈ రెండింటి వెనుక సచివాలయం ఉందని, వీటికి ముందుభాగాన ఎత్తయిన అమరవీరుల స్థూపం నిర్మించాలని సిఎం ఆదేశించారు. దీనికి సంబంధించి తక్షణమే పర్యవేక్షణ కొనసాగించాలని, త్వరితగతిన పనులు పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డిని ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న తెలంగాణవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానితోపాటు న్యూఢిల్లీ తెలంగాణ భవన్‌లో వినూత్న రీతిలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం ఆదేశిస్తూ సాంస్కృతిక శాఖకు బాధ్యతలు అప్పగించారు. హుస్సేన్‌సాగర్ ఆవలితీరాన సికిందరాబాద్ వైపు అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన సమీక్షలో ఎంపీ బాల్కసుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి ఎమ్మెల్సీ భానుప్రకాశ్, సిఎస్ రాజీవ్ శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి బిఆర్ మీనా తదితరులు పాల్గొన్నారు.
chitram...
రాష్ట్రావతరణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్