జాతీయ వార్తలు

అత్యాచారంపై హాహాకారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి/తిరువనంతపురం, మే 3: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో కొద్ది రోజుల క్రితం దళిత సామాజిక వర్గానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని (30) అత్యాచారానికి, దారుణ హత్యకు గురవడాన్ని ఖండిస్తూ విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ మహిళ ఏప్రిల్ 28వ తేదీన పెరుంబవూర్‌లోని తన నివాసంలో హత్యకు గురవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ నెల 16వ తేదీన శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళలో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారానికి గురై ఆ తర్వాత గాయాలతో ఆసుపత్రిలో కన్నుమూసిన ‘నిర్భయ’ ఉదంతాన్ని తలపిస్తున్న ఈ దారుణం కేరళలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దిగ్భ్రాంతికరమైన ఈ నేరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించి తీరుతామని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఉద్ఘాటించారు. కాగా, బాధితురాలి మెడతో పాటు దేహంపై వివిధ ప్రదేశాల్లో 13 గాయాలు ఉన్నాయని, నిందితులు ఆమె గొంతు పిసికినట్లు కనిపిస్తోందని ఎర్నాకుళం రేంజ్ ఐజి మహిపాల్ యాదవ్ తెలిపారు. అయితే ఆమె దేహంపై దాదాపు 20 గాయాలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, నేరానికి పాల్పడింది వీరేనా? కాదా? అన్న విషయం ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఒక వ్యక్తేనని ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తు సమాచారాన్ని బట్టి తెలుస్తోందని, కానీ బాధితురాలి ఇంటి నుంచి కొంత మంది వ్యక్తులు బయటికి రావడాన్ని చూశామని స్ధానికులు చెబుతున్నారని మహిపాల్ యాదవ్ వివరించారు.

తప్పుడు ప్రచారం చేస్తే దండన
సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలి దివాకర్ రెడ్డి కమిటీ సిఫార్సు

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ,మే 3: ఆహారాన్ని కల్తీ చేసే వారికి, ఆహారానికి సంబంధించిన తప్పు డు ప్రచారం చేసే ప్రముఖ వ్యక్తులను అత్యంత కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం సభ్యుడు జెసి.దివాకర్ రెడ్డి నాయకత్వంలోని ఆహార, వినియోగదారుల ప్రయోజనాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. దివాకర్ రెడ్డి తన కమిటీ రిపోర్టును మంగళవారం లోకసభకు అందజేశారు. కల్తీ ఆహారాన్ని విక్రయించే వారికి ఐదు లక్షల రూపాయల జరిమానా, కఠిన కారాగార శిక్ష విధించాలని దివాకర్ రెడ్డి ప్రతిపాదించారు.కల్తీ ఆహారాన్ని దిగుమతి చేసుకునే వారికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించాలని కమిటీ నివేదికలో ప్రతిపాదించారు. ప్రముఖ సినిమా స్టార్లు, క్రీడాకారులు, ఇతర ప్రముఖలతో తమ ఉత్పత్తులను ప్రచారం చేసే సంస్థలు ఆహార కల్తీకి పాల్పడినా, నాణ్యత లేని ఆహారం, ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసినా, విక్రయించినా మొదటిసారి తప్పు డు పది లక్షల రూపాయల జరిమానా, రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని దివాకర్ రెడ్డి కమిటీ ప్రతిపాదించింది. రెండోసారి ఆహార కల్తీకి పాల్ప డే పక్షంలో యాభై లక్షల జరిమానా, ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ సంస్థలు మూడో సారి తప్పు చేసే పక్షంలో వాటి ఉత్పత్తి విలువ ఆధారంగా జరిమానా, కారాగార శిక్ష విధించాలని దివాకర్ రెడ్డి కమిటీ సూచించింది.

జనంలోకి వెళ్లండి

ప్రభుత్వ పథకాలపై ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ, మే 3: కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారానికి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎన్డీయే సర్కార్ సాధించిన విజయాలను జనంలోకి తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ముద్ర పథకం, ఎల్‌పిజి కనెక్షన్లను విస్తరించడం, దేశ వ్యాప్తంగా విద్యుదీకరణ వంటివి తన ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలని మంగళవారం ఇక్కడ జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ తెలిపారు. ఈ విజయాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లి రెండేళ్ల పాలన ఎంత అర్థవంతంగా సాగిందో తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కార్ పూర్తి చేయగలిగిందన్నారు.
ముద్ర పథకం ద్వారా 18వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తున్నామని, మూడు కోట్ల కుటుంబాలను ఎల్‌పిజి పరిథిలోకి తీసుకొచ్చామని మోదీ వివరించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేస్తున్న అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై బుధవారం రాజ్యసభలో, ఆరోతేదీన లోక్‌సభలో చర్చ జరుపుతామని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బల్‌రాజ్ మధోక్‌కు ప్రధాని మోదీ, బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ తదితరులు ఈ సందర్భంగా నివాళులర్పించారని తెలిపారు.

యుడిఎఫ్‌కు రెబెల్స్ దడ

కేరళలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

తిరువనంతపురం, మే 3: కేరళ శాసనసభ ఎన్నికలకు ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలున్న పలువురు అభ్యర్ధులకు తిరుగుబాటు అభ్యర్ధులతో పాటు ఒకే రకమైన పేరున్న వారు దడ పుట్టిస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యుడిఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) కూటమికి ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం యుడిఎఫ్ అభ్యర్ధుల ఆధీనంలో ఉన్న పలు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్ధులు అధిక సంఖ్యలో బరిలోకి దిగారు. అయితే సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్), బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటములకు తిరుగుబాటు అభ్యర్ధుల బెడద అంతగా లేదు. ఏదిఏమైనప్పటికీ సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఈ ఎన్నికల్లో యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్, ఎన్‌డిఎ కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ యుడిఎఫ్‌తో పాటు మిగిలిన రెండు కూటములకు కూడా తిరుగుబాటు అభ్యర్ధుల నుంచి ముప్పు లేకపోలేదు.
అయితే తిరుగుబాటు అభ్యర్ధుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కెసి.జోసెఫ్ ఒకరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందికి అత్యంత నమ్మకస్తుడైన జోసెఫ్ ఇరిక్కుర్ నియోజకవర్గం నుంచి ఎనిమిదోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
జోసెఫ్ అభ్యర్ధిత్వం పట్ల స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరాన్ని వ్యక్తం చేసినప్పటికీ పార్టీ నాయకత్వం మళ్లీ ఆయననే బరిలోకి దింపాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నాయకుడు బినోయ్ థామస్ ‘సేవ్ కాంగ్రెస్’ బ్యానర్‌తో జోసెఫ్‌కు వ్యతిరేకంగా పోటీకి దిగాడు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పిసి.విష్ణునాథ్ (చెంగన్నూర్), కెఎం.షాజీ (అజికోడ్), డొమెనిక్ ప్రజెంటేషన్ (కొచ్చి) తదితరులకు కూడా తిరుగుబాటు అభ్యర్ధుల నుంచి ముప్పు పొంచి ఉంది.