తెలంగాణ

28 పార్టీలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్రంలో 28 పార్టీలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్) పేరిట రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటైంది. ఫ్రంట్ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం ఎన్నికైనట్టు బిఎల్‌ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. బిఎల్‌ఎఫ్ తొలి బహిరంగ సభను ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఈ సభకు సిపిఎం జాతీయ నాయకుడు సీతారామ్ ఏచూరి, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు, మేధావులు హాజరవుతారన్నారు. ఉన్న పార్టీనో ముఖ్యమంత్రినో గద్దె దించేసి కొత్త పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఈ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయలేదని నల్లా సూర్యప్రకాశ్ స్పష్టం చేసారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ధనికులకు దాసోహమవుతున్న విధానాన్ని మార్చడమే ఫ్రంట్ లక్ష్యమన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగానే బిఎల్‌ఎఫ్ ఫ్రంట్ పని చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్రంట్ 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. ఈ ఫ్రంట్‌లోకి సిపిఐ, న్యూడెమాక్రసీ పార్టీలతో పాటు ఇతర వామపక్ష పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నామని నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు.