తెలంగాణ

ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్రీయ స్వయం సంఘ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ నగర కార్యవాహ డిఆర్‌ఎస్ నరేంద్ర తెలిపారు. ప్రధానకార్యక్రమం ఉదయం 8 గంటలకు నింబోలిఅడ్డలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఓటు రాజకీయాల కారణంగా కుల , మత వైషమ్యాలు విచ్చుకుంటున్నాయని, అటువంటి భావాలు హెచ్చుమీరితే రేపటి తరం సమాజంలో కలిసి బ్రతకడం కష్టమని అన్నారు. ఫలితంగా భారతీయులు అందరూ ఒక్కటే అనే భావన కనుమరుగు అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్ధేశ్యంతోనే సమాజంలో సమరసత సాధించేందుకు సంఘ్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమానికి సంఘ్ జ్యేష్ఠ ప్రచారకులు, సామాజిక సమరసత జాతీయ అధ్యక్షులు కె శ్యాం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. గంగాపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు సభకు అధ్యక్షత వహిస్తారని తెలిపారు.
షాద్‌నగర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ నుండి షాద్‌నగర్ వెళ్లనున్నారు. అక్కడి నుండి వనపర్తి జిల్లా నాగవరం గ్రామానికి వెళ్తారు. మధ్యాహ్నం భీమనగుంటపల్లిలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. చిట్యాల గ్రామంలో బిజెపి జండాను ఎగురవేస్తారు. అనంతరం ఆయన అక్కడ ఉన్న అనాధ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిరుద్యోగ గర్జన కార్యక్రమంలో పాల్గొంటారు. 13న ఆయన జోగులాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం ఆలంపురం నియోజకవర్గంలో పార్టీశక్తి కేంద్రాల సమావేశంలో పాల్గొంటారు.