తెలంగాణ

ప్రభుత్వ అవినీతిని నిరూపించలేకపోతే..ఆబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ‘విద్యుత్తు వెలుగుల వెనక జరిగిన అవినీతిని నిరూపించలేకపోతే ఆబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తా..’ అని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్తు వెలుగుల వెనక అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణపై టిఆర్‌ఎస్ నాయకులు స్పందిస్తూ దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సవాల్‌ను స్వీకరించిన రేవంత్ రెడ్డి ఎక్కడికి రమన్నా వస్తానని, చివరకు ప్రగతి భవన్‌కు రమ్మన్నా వస్తానని ప్రతి సవాల్ విసిరారు. ఇలాఉండగా రేవంత్ రెడ్డి శుక్రవారం పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను తదితర నాయకులను వెంట పెట్టుకుని మధ్యాహ్నం అసెంబ్లీ, కంట్రోలు ఎదురుగా ఉన్న గన్ పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద బైఠాయించి, టిఆర్‌ఎస్ నాయకుల కోసం, రాష్ట్ర మంత్రుల కోసం ఎదురు చూశారు. ఎవరు వచ్చినా చర్చకు సిద్ధం అని రేవంత్ రెడ్డి అక్కడ బైఠాయించారు. చాలా సేపు వారు ఎదురు చూశారు. దీంతో ఆ ప్రాంతమంతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్తు వెలుగులపై జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం అన్న టిఆర్‌ఎస్ నాయకుల కోసం తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. సవాల్ విసిరిన టిఆర్‌ఎస్ నాయకులు 24 గంటల గడవక ముందే వెనక్కి పోయారని ఆయన తెలిపారు. విద్యుత్తు వెలుగుల వెనక అవినీతి జరిగింది నిజం అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు కేటాయిపులు, నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టుల కారణంగానే ఇప్పుడు మిగులు విద్యుత్తు ఉంటున్నదని ఆయన తెలిపారు. విద్యుత్తు వెలుగులపై అవినీతి జరగలేదని చెప్పిన టిఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారని, ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. దోపిడీ, దొంగతనం బయటపడతాయనే చర్చకు ముఖం చాటేశారని ఆయన తెలిపారు.
ముందు తాను లేవదీసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిహెచ్‌ఇఎల్‌కు టెండర్లు పిలవకుండా రూ.30,400 కోట్ల రూపాయల పనులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిహెచ్‌ఇఎల్‌తో కేసీఆర్ బినామీలకు పనులు ఇప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయంతో జెన్కోకు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు?, ముఖ్యమంత్రి కేసీఆర్ భరిస్తారా?, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి భరిస్తారా? అని రేవంత ప్రశ్నించారు. దోపిడీ చేసేందుకే కాలం చెల్లిన సబ్-క్రిటికల్ టెక్నాలజీని కేసీఆర్ ఎంచుకున్నారని ఆయన విమర్శించారు. ఇండియా బుల్స్ కంపెనీ ఇచ్చే కమిషన్‌లకు ప్రభుత్వం కక్కుర్తి పడిందని ఆయన విమర్శించారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెబుతున్న వాటిల్లో వాస్తవాలు లేవన్నారు. మూడున్నర ఏళ్ళలో సీమాంధ్ర నేతలైన లగడపాటి, రామేశ్వర రావు కంపెనీల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తక్కువ ధరకు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్తు ఇస్తామన్నా మీరు ఎందుకు తిరస్కరించారని ఆయన ప్రశ్నించారు. మిగులు విద్యుత్తు అందుబాటులో ఉంటే ప్రాజెక్టులకు రూ.40 వేల కోట్లు అప్పు ఎందుకు తెచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణలపై సీబీఐకి ఇస్తారా? లేక సెంట్రల్ విజిలెన్స్‌కు ఇస్తారా? మీ ఇష్టం అని ఆయన తెలిపారు. కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలని, కేసీఆర్ చెప్పినట్లు వింటే భవిష్యత్తులో జైలుకేనని ఆయన హెచ్చరించారు. లోగడ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పోలవరం కాంట్రాక్టులు దక్కించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బయటపెట్టింది తానేనని ఆయన తెలిపారు.
ఎప్పుడైనా వాస్తవాలు ఉంటేనే తాను మాట్లాడుతానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల కుటుంబాల వద్దకు, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళగలరా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్ళు మొక్కిన కేసీఆర్ విశ్వసనీయత ఎంతో ప్రజలందరికీ తెలుసునని రేవంత్ అన్నారు.

చిత్రం..గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద రేవంత్‌రెడ్డి తదితరులు