తెలంగాణ

24 గంటల విద్యుత్‌లో ఎలాంటి ఆటంకం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: దేశంలో తొలిసారిగా రాష్ట్రం అవతరించిన మూడున్నరేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా ప్రారంభించిన తెలంగాణలో మొదటి పది రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు తలెత్తలేదు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో వ్యవసాయం ఉన్న 30 జిల్లాల్లో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ నిరాటంకంగా సరఫరా చేస్తున్నట్లు, ఫిర్యాదులు లేవని తెలంగాణ విద్యుత్ శాఖకు వివిధ జిల్లాల నుంచి సమాచారం వచ్చింది.
ముఖ్యమంత్రి కెసిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు, భారీ సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు విద్యుత్ సరఫరా విధానంపై అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అధికారుల నుంచి సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 24 గంటల వ్యవసాయం, మిగులు విద్యుత్‌పై చర్చకు రెడీ అని, విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి తమ వల్లనే నంటూ సవాళ్లు విసురుతుండగా, అదే స్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీ కూడా విపక్ష పార్టీ విమర్శలను తిప్పిగొడుతోంది. రాజధానిలో శీతాకాలంలో విద్యుత్ రాజకీయాలపై వాతావరణం వేడెక్కింది.
తెలంగాణ గ్రామాల్లో మాత్రం 24 గంటల విద్యుత్‌తో రైతులు ఎటువంటి ఆందోళన లేకుండా లభ్యతలో ఉన్న నీటిని తోడి వ్యవసాయం చేస్తున్నారు. 24 గంటల విద్యుత్ వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏమీ అమాంతం పెరగలేదు. సాధారణంగా ప్రతి ఏడాది 15 శాతం అదనపు డిమాండ్ పెరుగుతుంది. గతరెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది 16 శాతం పెరిగింది. 2016 జనవరి 4వ తేదీన విద్యుత్ డిమాండ్ 130 ఎంయు ఉండగా, 2017లో 157 ఎంయుకు చచేరింది. ఈ ఏడాది అదే రోజు విద్యుత్ డిమాండ్ 182 ఎంయుకు చేరింది. కాని జనవరి 8వ తేదీన డిమాండ్ 177 ఎంయుకు పడిపోయింది. 24 గంటల వ్యవసాయ విద్యుత్ ప్రారంభమైన తర్వాత విపక్ష పార్టీల విమర్శలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎక్కడ ఏ చిన్న ఫిర్యాదు వచ్చిన స్పందించి మరమ్మత్తులు చేయాలని ట్రాన్స్‌కో, జెన్కోను ఆదేశించింది. అలాగే భూగర్భ జలాల వినియోగం పెరుగుతుందనేదాంట్లో వాస్తవం లేదని విద్యుత్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
సాధారణంగా ఇటీవల కాలంలో భూగర్భ జల మట్టాలు ఏ ఏడాదికా ఏడాది తగ్గుతున్నాయి. కొన్ని వారాలు గడచినతర్వాత కాని భూగర్భ జలాలు తగ్గుతున్నాయా లేదా అనేవిషయం తెలుస్తుందని, మొదటి వారంలోనే ఒక నిర్ణయానికి రావడం తగదని విద్యుత్ శాఖ అధికారులంటున్నరు. 2016-17లో వ్యవసాయానికి డిస్కాంలు 14,373 ఎంయు విద్యుత్ను సరఫరా చేశాయి. 2017-18లో 15,683 ఎంయు విద్యుత్ వ్యవసాయానికి అవసరమని అంచనావేశాయి. అలాగే 2018-19లో 16,853 ఎంయు విద్యుత్ అవసరమని డిస్కాంలు అంచనాలు తయారు చేశాయి. 24 గంటల విద్యుత్ ప్రాతిపదికన 2018-19 విద్యుత్ లెక్కలను తయారు చఏశాయి.
అంటే 2016తో పోల్చితే 2018-19లో అదనంగా 2480 ఎంయు విద్యుత్ వ్యవసాయానికి ఖర్చవుతుంది. ఐదు రూపాయలకు ఒక యూనిట్‌కు ఖర్చయితే, అదనపు విద్యుత్‌కు దాదాపు 12.4 బిలియన్ల రూపాయల ఖర్చవుతుంది. కాని ఈ ఖర్చుపెరిగే అవకాశం ఉంది రెండువేల కోట్ల మేర అదనపు భారం పడవచ్చని అంచనా. 2014లో 6574 మెగావాట్లతో విద్యుత్ రంగంలో ప్రయాణం ప్రారంభించిన తెలంగాణ ఇప్పుడు 14,845 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. ఉచిత విద్యుత్ వల్ల వచ్చే మార్చి నుంచి విద్యుత్ డిమాండ్ 11500 మెగావాట్లకు చేరుకున్నా తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ జెన్కో అధికారులు చెప్పారు.