తెలంగాణ

అధికారంలోకి రాగానే.. గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తున ఎవరైనా కల్లు గీత కార్మికుడు చెట్టుపై నుంచి పడి మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గుజరాత్, కేరళ రాష్ట్రాల తరహాలో కల్లు గీత కార్మిక వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి గ్రామీణ ఖాదీ బోర్డు పరిథిలోకి తెస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్‌లో టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రసంగిస్తూ నాలుగు సంవత్సరాల బీసీల సమస్యలు పట్టని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ బీసీ సబ్-ప్లాన్ గురించి మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాత్రం బీసీ సబ్-ప్లాన్ పేరిట బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌడలకు రాజకీయంగా, ఆర్థికంగా గౌడలకు సముచిత స్థానం కల్పించిందని ఆయన తెలిపారు.
బీసీలకు జనాభా ప్రాతిపాదికన 50 శాతం నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ-ఈ గ్రూపులో ఉన్న ముస్లింలకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రభుత్వం అదేవిధంగా జనాభా ప్రాతిపాదికన బీసీ ఎ,బి,సి,డిల్లో ఉన్న వారికి కూడా కల్పించాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీనవర్గాల వ్యతిరేక అని ఉత్తమ్ విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్ ప్రభృతులు ప్రసంగించారు.
మహాగొప్ప నేత మర్రి
* కుంతియా నివాళి
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మహా గొప్ప నేత అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా తెలిపారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి 99వ జయంతి సందర్భంగా కుంతియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.