తెలంగాణ

ఉపాధి హామీ కార్మికులకు వేతనాలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, వ్యవసాయ కార్మికుల ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ జి. సంజీవరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు ఒక వినతి పత్రం సమర్పించారు. ప్రత్యామ్నాయ ఉపాధి లేక నిరుపేదలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారని, వారికి గత ఆరు మాసాల నుండి వేతనాలు చెల్లించడం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. జాతీయ వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం ప్రతి నెల 10వ తేదీలోగా వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని, ఆర్ధిక ఇబ్బందులున్నాయనే పేరుతో వేతనాల చెల్లింపు జాప్యం చేస్తామంటే చట్టం ఊరుకోదని అన్నారు. ఈ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం న్యాయవివాదాలు ఎదుర్కోవల్సి ఉంటుందని, అదే జరిగితే 10 రెట్లు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా బకాయిలు చెల్లించాలని సూచించారు.