తెలంగాణ

విఆర్‌ఏ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, జనవరి 12: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మాదిగ చెరువు సమీపంలో శుక్రవారం భూ తగాదాలో ఇద్దరు గ్రామ రెవెన్యూ సహాయకులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే హత్యకు గురికాగా, మరొకరు తీవ్ర గాయాలపాలై కోమాలో ఉన్నారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కాటారం మండల కేంద్రంలోని మాదిగ చెరువు సమీపంలోని 501 సర్వే నెంబరులో గల భూమిని శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌తో చదును చేస్తుండగా ఇదే గ్రామం దుబ్బగూడెంకు చెందిన సొదారి శ్రీనివాస్‌కు, కాటారం గ్రామానికి చెందిన ఇద్దరు వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న బొడ్డు రాములు, బొడ్డు లక్ష్మణ్‌లకు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయ. సదరు భూమి తమది అంటే తమది అని ఇరువర్గాల మధ్య గతంలో కూడా ఘర్షణలు జరిగాయ. శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌తో భూమిని చదును చేస్తుండగా పరిసరాలలో గుబురు పొదలలో బొడ్డు రాములు, బొడ్డు లక్ష్మణ్ కూర్చుండి పరిశీలిస్తున్నారు. కాగా అక్కడే మాటు వేసిన సొదారి శ్రీనివాస్ (30) అనే యువకుడు బొడ్డు రాములు (45), బొడ్డు లక్ష్మణ్ (35)ల తలపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో బొడ్డు రాములు అక్కడికక్కడే మృతి చెందగా, బొడ్డు లక్ష్మణ్ తీవ్ర గాయాలతో రక్త స్రావం జరుగుతుండగా 108 అంబులెన్స్‌లో మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం కోమా స్థితిలో ఉన్న బొడ్డు లక్ష్మణ్‌ను వరంగల్ ఎంజిఎంకు అంబులెన్స్‌లో తరలించారు. సంఘటనా స్థలంలో బొడ్డు రాములు, లక్ష్మణ్‌లు ఇరువురు పక్కపక్కనే రక్తం మడుగులో పడి ఉండడంతో భీకర వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలాన్ని కాటారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చింతల శంకర్‌రెడ్డి, రెండవ ఎస్‌ఐ జహీర్‌ఖాన్ పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. నిందితుడిగా భావిస్తున్న సొదారి శ్రీనివాస్ (30) పోలీసులకు లొంగిపోయాడు. సంఘటన జరిగిన అనంతరం గొడ్డలిని దాచి పెట్టి నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్టు సమాచారం. కాగా బొడ్డు రాములుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దాడికి గురైన వ్యక్తుల కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. ఇదిలా ఉండగా సంఘటనాస్థలా న్ని తహశీల్దారు వేదాంతం శ్రీనివాసాచార్యులు, రెవెన్యూ ఉద్యోగులు, పలు సంఘా ల నాయకులు సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చిత్రం..దాడిలో హతమైన వీఆర్‌ఏ రాములు, కోమాలో మరో విఆర్‌ఏ లక్ష్మణ్