తెలంగాణ

రీ డిజైన్ల పేరుతో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జనవరి 12: రీ డిజైన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం వనపర్తి సంఘం పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన నిరుద్యోగుల యువగర్జన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేశారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీ డిజైన్ల పేరుతో జేబులు నింపుకొనే ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వాటిని మరిచారన్నారు. ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు అందించలేదని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలు ఒక వైపు ఇస్తూనే పల్లె సీమల్లో బెల్టు షాపులు పెట్టి మరో చేత్తో ప్రజల డబ్బును లాగుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ తోటి నిరుద్యోగులకు, భావితరాలకు ఉద్యోగాలు వస్తాయని ఆత్మర్పణ చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీవిద్యార్థులు, నిరుద్యోగు ఆత్మ నేడు ఘోషిస్తోందన్నారు. తాము ఆశించిన తెలంగాణ ఇదేనాఅని విద్యార్థులు, యువకులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని గెద్దెనెక్కిన కేసీఆర్ రాజకియ నిరుద్యోగం లేకుండా భర్తీ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. పల్లెలో తాగులేక ప్రజలు తంటాలు పడుతుంటే ఇష్టానుసారంగా బెల్టుషాపులు తెరచి తాళి పుస్తేలు అమ్ముకునే దుస్థితికి తెచ్చారన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులను మరచి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం మజ్లిస్ పార్టికి వత్తాసు పలుకుతూ, నిజాంను కీర్తిస్తూ ఓట్ల రాజకీయానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాలలో 16వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 10వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారని ఆయ న అన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు ఉద్యమాలు చేస్తే అణచి వేయడానికే భర్తీ చేశారని ఆయన అన్నారు. లక్షా 12వేల ఉద్యోగాలు ఏడాదిలో ఎలా భర్తీ చేస్తారో ప్రభుత్వం క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రాజకీయ ఉద్యోగాలు ఖాళీ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ మాటలు కడుపు నింపితే చేతలు కడుపు మండేలా చేస్తున్నాయని ఆయన అన్నారు. యువత తిరగబడే రోజు దగ్గర పడిందని అన్నారు. ఆంధ్రలో 50వేల టీచర్ పోస్టులు భర్తీ చేయగా, తెలంగాణలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని అన్నారు. రాష్ట్రంలో అనేక పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం చక్కెర కార్మాగారం మూత పడితే పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. హౌసిం గ్ కార్పొరేషన్‌ను మూసివేశారని అన్నారు.
ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామిలను నిలపుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునేందుకు యువతను సిద్ధం చేయాలని, నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలనను అంతం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని ఆయన అన్నారు. అంతకు ముందు వనపర్తి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానందుని విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, యువజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్, నాయకులు రజనీ, నర్సింగ్‌రావు, సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, బి.కృష్ణ, శ్రీశైలం,సీతారాములు, పరుశురాం, నారాయణ, నాగభూషణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..వనపర్తి యువగర్జనలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్