తెలంగాణ

అజారుద్దీన్ హైదరాబాదీ కాదా? : వీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 12: భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ హైదరాబాదీ కాదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు ప్రశ్నించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ధ్వజమెత్తారు. అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించక పోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం ఉంటే అజ్జ్భుయ్ అని అవసరం తీరాక హట్‌చలో అంటారా? అని నిలదీశారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ సభ్యుడు కాదని వివేక్ అనడం సిగ్గుచేటని అన్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పడ్డ ప్యానల్‌కు శేషునారాయణ కార్యదర్శిగా, వివేక్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి శేషునారాయణను తప్పించి వివేక్ సోదరుడు వినోద్‌కు పదవి ఇప్పించాలనే కుట్రతోనే సస్పెండ్ వేటు వేశారని ఆరోపించారు.
ఉప్పల్ స్టేడియానికి వివేక్ తండ్రి వెంకటస్వామి పేరు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వెంకటస్వామి పేరుతో జరుగుతున్న టోర్నీల్లో భారీ వసూలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.