తెలంగాణ

గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: వెనుకబడిన తరగతుల వారికి ఉద్ధేశించిన వివిధ సంక్షేమ పథకాల అమలుకు గ్రామాల వారీ లబ్దిదారులను ఎంపిక చేయాలని బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరో పక్క ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 102 కోట్లను సత్వరమే లబ్దిదారులకు అందజేసేలా చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి మండలాన్ని యూనిట్‌గా చేసుకుని గ్రామాల వారీ లబ్దిదారులను ఎంపిక చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కళ్యాణలక్ష్మి పథకం లబ్దిదారులకు పెళ్లిరోజున చెక్కుల పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై ప్రతి రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. నాయి బ్రాహ్మణ, విశ్వకర్మలతో పాటు సంచార జాతుల లబ్దిదారుల జాబితాను ముందస్తుగా రూపొందించుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకు చేరేలా సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లకు తగిన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. జిల్లాల్లో అన్ని సంక్షేమ హాస్టళ్లను మార్చిలోగా కలెక్టర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో అద్దె భవనాల జాబితాను వాటి అద్దెలను ఖరారు చేయాలని సూచించారు. స్టడీ సెంటర్ల విస్తరణపై కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. విదేశీ విద్యా పథకాన్ని మరింత విస్తరించాలని కోరారు. 31లోగా అర్హులైన విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలకు 10 ఎకరాలకు తక్కువ కాకుండా స్థల సేకరణ చేట్టాలని కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో జిల్లా కలెక్టర్లు అందించిన సహకారంపై కార్యదర్శి ధన్యవాదాలు తెలిపారు.