తెలంగాణ

గవర్నర్‌తో సీఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన గవర్నర్ రాష్టప్రతి, ప్రధాన మంత్రితో సమావేశమైన సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇటీవల గవర్నర్‌ను కలిసిన సందర్భంగా వారు చేసిన విమర్శల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.
ప్రజలకు సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్తకాంతులు నింపాలని, అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా ముందుకుసాగాలని భగవంతుడిని ప్రార్థించినట్టు తన సందేశంలో పేర్కొన్నారు.