రాష్ట్రీయం

మెట్రో @ 2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2018 డిసెంబర్ నాటికే పూర్తవుతుందని లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి)కి చెందిన మెట్రోరైలు విభాగం తేల్చేసింది. ఈ ఏడాది జూన్ 2 నాటికి మెట్రో రైలు ప్రాజెక్టు కమ్మర్షియల్ అపరేషన్స్‌ను ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ముందు నిర్ణయించినట్లు 2017 జూలై నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉందని, కానీ మరో 18 నెలల పాటు మెట్రో రైలు ప్రాజెక్టు అలస్యం అవుతుందని ఎల్‌అండ్‌టి హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరక్టర్, సిఈఓ విబి గాడ్గిల్ వెల్లడించారు. బుధవారం నాడిక్కడ ఒక హాటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరులే సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ఒకటని కాదు చాలా కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. భూములకు సంబంధించిన క్లియరెన్సులు, సాంకేతిక అంశాలు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి మెట్రో రైలు ప్రారంభించడం సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేశారు. ఇంకా స్టేషన్ల ఆవరణలో టిక్కెటింగ్ విధానం, సాంకేతిక సిబ్బందికి శిక్షణ వంటివి కొనసాగుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) కింద ఇంటి భారీ ప్రాజెక్టును చేపడుతున్నామని అన్నారు. ఎల్‌అండ్‌టి మెట్రో రైలు విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం అందుతోందని తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం అయినందుకు ప్రభుత్వం నుంచి 3 వేల కోట్లు అదనంగా చెల్లించాలని అడిగిన మాట వాస్తవమేనా అన్న ప్రశ్నకు ఎల్‌అండ్‌టి ప్రెసిడెంట్, చైర్మన్ ఎల్‌అండ్‌టి హైదరాబాద్ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్) చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో ఇందుకు సంబంధించిన సంప్రదింపులు సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఈక్విటీ కాంపోనెంట్‌గా రూ.2,700 కోట్లతో పాటు మొత్తం 9 వేల కోట్లను ఈ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టినట్లు సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దాదాపు 44 ఏళ్లపాటు ఎల్‌అండ్‌టితో సుధీర్ఘంగా పని చేసిన గాడ్గిల్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారని, ఆయన స్థానంలో జూన్ 1 నుంచి శివానంద్ నింబార్గి బాధ్యతలు స్వీకరించనున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తుత దశకు తీసుకురావడానికి గాడ్గిల్ కీలకపాత్ర పోషించారని అన్నారు. ప్రస్తుతం మెట్రోరైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, కొన్ని అభివృద్ధి దశ నుంచి కార్యాచరణ దశకు రానున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన మెట్రోరైలు ఎండి నింబార్గిని ఆయన పరిచయం చేస్తూ ఆహ్వానించారు.
chitram...
ఎండిగా బాధ్యతలు స్వీకరించనున్న నింబార్గి (మధ్య)