తెలంగాణ

ఆకట్టుకున్న భారీ రంగవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని టౌన్, జనవరి 13: వినూత్న కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును కైవసం చేసుకుంది. రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోశం దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ రంగవల్లికి ఈ పురస్కారం దక్కింది. శనివారం గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. సుమారు 500 మంది మహిళలు 1800 స్వ్కేర్ యార్డు లో 1939 చుక్కలతో ఈ ముగ్గును వేశారు. ఎన్టీపీసీ, సింగరేణి, రామగుండం కార్పొరేషన్‌తోపాటు ఇతర లోగోలతో ఈ ముగ్గు కూడుకొనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ ముగ్గు చోటు చేసుకుంది. అనంతరం స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ముగ్గుకు ఇలాంటి పురస్కారం దక్కడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు బాధ్యురాలు జ్యోతి చేతుల మీదుగా జడ్పీటిసి కందుల సంధ్యారాణి పోశం రికార్డు పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ అపూర్వ రావు, సామాజిక కార్యకర్త డాక్టర్ పెంట రాజేష్, ఎల్కల్లపల్లి సర్పంచ్ పల్లె శ్రీనివాస్ యాదవ్, కుందనపల్లి సర్పంచ్ మేకల సరస్వతీ మైసయ్య, కార్పొరేటర్లు సాయి, తానిపర్తి గోపాల్ రావు, మారుతి, లలితా భాస్కర్, బద్రి రజిత రాజు, మల్లయ్య, దాసరి శ్రీనివాస్ తదితరులున్నారు.

చిత్రాలు..భారీ ముగ్గులు వేస్తున్న మహిళలు
* ఇన్‌సెట్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును అందుకుంటున్న జడ్పీటీసీ సంధ్యారాణి