తెలంగాణ

టీచర్ల సెలవులపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: టీచర్ల సెలవులపై పారదర్శకత , జవాబుదారీ తనం పాటించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్‌సి నెంబర్ 83 వివాదాస్పదంగా మారింది. టీచర్లు సెలవు పెడితే మండల విద్యాధికారికి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడి ద్వారా దరఖాస్తు చేయాలనడం దుర్మార్గమైన కుట్ర అని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. తెలంగాణ ఎస్‌జిటియు ప్రధానకార్యదర్శి పద్మారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఉద్యోగులను అవమానించే రీతిలో ఈ ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థను నడిపించే వారే కుట్ర లు, కుతంత్రాలు చేస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు లెక్కలేనన్ని అప్పగిస్తున్నారని, ఇతర శాఖల్లోని ఉద్యోగులు తమ శాఖలకు పరిమితమై పనిచేస్తుండగా, ఉపాధ్యాయులు మాత్రం అనేక శాఖ ల పనులను చేయాల్సి వస్తోందని, స్కూళ్లను తెరుస్తున్న ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించడం లేదని, క్యాడర్ స్ట్రెం క్త్‌పై స్పష్టత లేదని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నా యి. ప్రభుత్వ స్కూళ్లపై రకరకాల ప్రయోగాలు జరుగుతుదన్నాయని, రెసిడెన్షియల్, గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, ఎస్సీ వెల్ఫేర్ స్కూళ్లు, ఎస్టీ వెల్ఫేర్ స్కూళ్లు, మైనార్టీ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు ఇలా లెక్కలేనన్ని పేర్లతో సాగుతున్న స్కూళ్లను వదిలేసి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సక్రమంగా సాగడం లేదని అనడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్కో గెజిటెడ్ అధికారి పాఠశాల హెచ్‌ఎంగానూ, మండల విద్యాధికారిగానూ పనిచేయాల్సి వస్తోందని, గ్రామంలోని పిల్లల సంఖ్య ఆధారంగా కాకుండా పాఠశాల ల్లో పిల్ల ల ఆధారంగా ఉపాధ్యాయులను నియమించాలని, ఈ అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా నేటికీ సర్వీ సు రూల్స్ అమలులోకి రాలేదని, అవసరమైన ఉపాధ్యాయుల నియామకాలకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తెలుగు మాధ్యమం, తెలుగు భాష అమలుకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు, సరిపడా సిబ్బందిని నియమించలేదని వారు ఆరోపించారు.