తెలంగాణ

సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జనవరి 16: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకుగాను వారబందీ పద్ధతిలో సోమవారం రాత్రి నీటి విడుదలను డ్యాం అధికారులు ప్రారంభించారు. ఎడమకాల్వకు గత సంవత్సరం డిసెంబర్ 10నుండి వాయిదాల పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగురోజుల క్రితం జరుగుతున్న నీటి విడుదలను నిలిపివేస్తున్న అధికారులు సోమవారం నుండి ప్రారంభించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 528.70 అడుగుల నీటిమట్టం ఉండగా ఎడమకాల్వ ద్వారా సగటున 8వేల క్యూసెక్‌లు, కుడి కాల్వ ద్వారా 5,302 క్యూసెక్‌లు ప్రధాన విద్యుత్ జలకేంద్రం ద్వారా 5,382 క్యూసెక్‌లు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 500క్యూసెక్‌లను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు 4,008 క్యూసెక్‌ల నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ సి.సునీల్ మాట్లాడుతూ రబీ పంటకుగాను ఎడమకాల్వ ఆయకట్టు పరిథిలో డిసెంబర్ 10నుండి నేటి వరకు 17.5 టీఎంసీల నీటిని వాయిదాల పద్ధతిలో విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం ఎడమకాల్వకు ఈనెల 28వరకు సగటున రోజుకు 8వేల క్యూసెక్‌ల చొప్పున విడుదల చేస్తామని తెలిపారు.