తెలంగాణ

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను బాహాటంగా ఉల్లంఘిస్తోందని టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని ఎన్నికలు సజావుగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇవిఎంలతో పాటు వోటర్స్ వెరిఫబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఏటి)ని అమర్చాలని, లేదా బ్యాలెట్ పత్రాన్ని వినియోగించాలని కోరారు. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో మాల్ అవకతవకలను నిరోధించేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను నియమించాలన్నారు. ఇవిఎంలను టాంపర్ చేయడం, పోలింగ్ రోజు మద్యంను పంపిణీ చేసే దుందుడుకు ధోరణులకు టిఆర్‌ఎస్ పార్టీ పాల్పడుతుందన్నారు. ఇంతవరకు ఈ అసెంబ్లీ పరిధిలో కేంద్ర బలగాలను నియమించలేదన్నారు. కూసుమంచి సిఐ,ఖమ్మం రూరల్ సిఐ, ఎంపిడివో పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. వీరందరూ టిఆర్‌ఎస్ అభ్యర్ధి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.