తెలంగాణ

కోయిల్‌సాగర్ ఆయకట్టు పనులకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 16: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలు వ కింద అదనపు ఆయకట్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ఎడమ కాలువ కింద దాదాపు 8014 ఎకరాల అదనపు ఆయకట్టును అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. దాంతో ఈ ఆయకట్టుకు నీటిని తరలించే కాల్వ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూనే ప్రభు త్వం రూ.33.70 కోట్లు నిధులు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల పరిధిలో అదనపు ఆయకట్టు రానుంది. ఎన్నో ఏళ్ల నుండి కోయిల్‌సాగర్ ఎడమ కాల్వ ఆదనపు ఆయకట్టు కోసం ప్రయత్నించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని పలు మార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురావడమే కాకుండా మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులకు తీపికబురు వినిపించింది.

చిత్రం..మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి