తెలంగాణ

సిఫార్సుల అమలులో కేంద్రం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: విద్యా ప్రమాణాలు పెంచేందుకు వివిధ కమిటీలు చేసిన సిఫార్సులను అమలు చేయడంలో కేంద్ర మానవ వనరుల శాఖ విఫలం చెందిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర విద్యా సలహా మండలి (కేబ్) సమావేశంలో మంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ భవన్ కడియం విలేఖరులతో మాట్లాడుతూ రెండు రోజులు జరిగిన కేంద్ర విద్యా సలహా మండలి సమావేశాలు ఎంటువంటి నిర్ణయాలు తీసుకోకుండానే అసంతృప్తిగా ముగిసినట్టు చెప్పారు. ఈ సమావేశాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు వివిధ రాష్ట్రాల మంత్రులుతో కేంద్ర మానవ వనరుల శాఖ వేసిన కమిటీలు చేసిన ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. దేశంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘కేబ్’ సమావేశాల నుంచి ఎటువంటి ఫలితాలు రావడం లేదని, ఈ సమావేశాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలం చెందాయని ఆయన మండిపడ్డారు. ప్రతి ఏడాది జరిగే సాధారణ సమావేశాల మదిరిగానే ఈ సమావేశాలు ముగిసాయని చెప్పారు. ఈ సమావేశాలపై పలు రాష్ట్రాల విద్యా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఎటువంటి ఫలితాలు రానటువంటి ఇలాంటి సమావేశాలు ఇకమీదట నిర్వహించ వద్దని కేంద్ర మంత్రికి సూచించినట్టు వెల్లడించారు. తాను చైర్మన్‌గా ఉన్న బాలికల విద్యాభివృద్ధికి వేసిన సబ్ కమిటీ కేంద్రానికి మధ్యంతర నివేదికను సమర్పించినట్టు వెల్లడించారు. దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల పెంపు, బాలికల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అభినందించారని చెప్పారు. అలాగే తెలంగాణలో గురుకుల పాఠశాలల నిర్వహణను అభినందించారని వెల్లడించారు.
విద్యా సంస్థల ఏర్పాటులో వివక్ష
తెలంగాణలో కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి కడియం ఆరోపించారు. రాష్ట్రంలో పలు విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని పలుమార్లు నివేదికలు సమర్పించినా కేంద్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు ట్రిపుల్ ఐటీలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ప్రకటించలేదని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో డిగ్రీ విద్యలో ఆన్‌లైన్లలో అడ్మిషన్లు అందిస్తున్నామని, విద్యాలయల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయడం ద్వారా బోగస్ అడ్మిషన్లు అరికట్టడంలో విజయం సాధించినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడేనాటికి 296 గురుకుల పాఠశాలలు ఉండేవని, వాటిని 470కి పెంచామని కడియం శ్రీహరి తెలిపారు.