తెలంగాణ

శాంతి భద్రతలకు నిలయం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 17: అల్లర్లు, అసాంఘిక కార్యకలపాలు లేకుండా... ప్రజా రక్షణ లో ముందున్నామని, సంపూర్ణ శాంతి భద్రత ల నిలయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచేందుకు పోలీస్ శాఖ పని చేస్తుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. పోలీస్ అంటే ఏర్పడే భయం ఇప్పుడు లేదని, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పూర్తిగా అమలులో ఉందని తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలినీయం హాల్‌లో రామగుండం కమిషనరేట్ పరిధి పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాత నేరస్థుల సమాచార సేకరణ కోసం రాష్ట్రంలో పోలీసు శాఖ సమ గ్ర సర్వేను నిర్వహించబోతుందని, ఈ సర్వే లో నేరస్థులకు సంబంధించిన అన్ని రకాల గుర్తింపు వివరాలను సేకరిస్తామని డీజీపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న పాత నేరస్థులు, మాఫియా, గ్యాంగ్ స్టర్స్‌ల పూర్తి స్థాయి కదలికలను రాబట్టేందుకు సర్వే ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పాత నేరస్థుల పూర్తి స్థాయి సమగ్ర సర్వే చేశాక ‘జియో ట్యాగింగ్’ విధానాన్ని అమలు పరచనున్నామని, ఈ విధానంతో నేరస్థుడు ప్రదేశం మార్చినా... ఎక్కడున్నా... ఎలా ఉన్నా... ఇట్టే దొరకబట్టే అవకాశం ఉండగా తప్పించుకునే పరిస్థితి కూడా ఉండబోదని చెబుతూ ఈ సర్వే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగనుందని డిజిపి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తం గా ఒకే పోలీసు విధానం అమలు చేయనున్నామని, ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ నిబద్ధతతో పని చేస్తుందని పేర్కొన్నారు. ఏ జిల్లాకు వెళినా ఫిర్యాదుదా రునికి ఒకేరకమైన సేవలు అందించే విధం గా అధికారులకు సూచనలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఐజి నాగిరెడ్డి, డిఐజి ప్రమోద్ కుమార్, పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్, డీసీపీలు వేణుగోపాల్ రావు, ఏసీపీ లు అపూర్వ రావు, హబీబ్ ఖాన్, వెంకట రమణ తదితరులున్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి