తెలంగాణ

ఒక్క యూనిట్ అయనా ఉత్పత్తి చేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, జనవరి 17 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క యూనిట్ అయినా విద్యుత్ ఉత్ప త్తి జరిగిందా? అని పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో వివిధ కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్న ఆయన గానుగబండ శివారులో కోటి 60 లక్షలతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను పరిశీలించిన అనంతరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. 2014లో శాసనసభ సమావేశాల్లో రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించుకుంటామని గొప్పలు చెప్పిన కేసీఆర్ రాష్ట్రంలో నేటికీ ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేదన్నది వాస్తవం కాదా అని అన్నారు. దేశవ్యాప్తంగా గత ప్రభుత్వాలు చేసిన కృషితో నేడు 24 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో మళ్లీ శాసనసభ ఎన్నికల వరకు కూడా ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా ప్రారంభమయ్యే పరిస్థితి లేదన్నారు. దామరచర్ల వద్ద చేపడుతున్న పవర్ ప్రాజెక్టు పనులకు తట్టెడు మట్టికూడా పోయలేదన్నారు. భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల పరిస్థితికూడా అంతే ఉందన్నారు. ప్రభుత్వ సంస్థ జెన్‌కోలో కాంగ్రెస్ పాలనలో 85శాతం పిఎల్‌ఎఫ్ ఉం డేదని, ఇప్పుడు 65శాతానికి పడిపోయిందన్నారు. ప్రభుత్వ సంస్థలో ఉత్పత్తి సామర్ధ్యం ఎందుకు తగ్గిందని, ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయటంలో మతలబు ఏమిటని ఆయన సూటిగా ప్రశించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని జైపూర్‌లో 1200 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్లు, జూరాలలో 240, పులిచింతలలో 80 వాట్ల ప్రాజెక్టులను మంజూరు చేసి డిజైన్ చేసి 80 శాతం పూర్తయిన సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిందని ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇదంతా తామే చేశామని చెప్పుకుని కేవలం ప్రాజెక్టుల ప్రారంభానికి స్విచ్ ఆన్ చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24గంటల కరెంటును సరఫరా చేస్తున్నట్టు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల భాషలలో ప్రకటనలు ఇచ్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల సొమ్మును ఫణంగా పెడుతున్నారన్నారు. కేసీఆర్ కొత్తగా చేసింది ఏమీలేదని గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు ఇప్పుడు చేతికొచ్చాయని దానిని తామే చేశామని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్ నియోజకవర్గ జడ్‌పిటిసిల ఫోరం కన్వీనర్ పెడెం శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పయిడిమర్రి రంగనాథ్, ఎంపిపి భీమపంగు సోమమ్మ, రామాంజి, కుక్కడపు గుర్వయ్య, కందుల కోటిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, నిజాముద్దీన్, మంజూనాయక్, కనె్నగొండ్ల ఆంజనేయులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం..గరిడేపల్లి మండలం గానుగుబండ శివారులో నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను పరిశీలిస్తున్న
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి