తెలంగాణ

ఆలయాల అభివృద్ధికి కోట్లాది నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్దికి కోట్లాదిరూపాయల నిధులను ఖర్చుచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.3 లక్షల వ్యయంతో నిర్మించనున్న రజక సంఘ భవనాన్ని, మరో రూ.3 లక్షల వ్యయంతో నిర్మించనున్న పెరిక సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలోని సాయిబాబా ఆలయ ఆవరణలో నిర్మించనున్న గోశాల మందిరానికి మంత్రి భూమిపూజచేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని దేవాలయాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమైన ఆలయాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి కోట్లాదిరూపాయల నిధులను మంజూరుచేస్తున్నామని తెలిపారు. లోక కల్యాణం కోసం ఆయుత చండీయాగాన్ని నిర్వహించడమే కాకుండా ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నామన్నారు. పెరిక సంఘ భవనం, రజక సంఘ భవనాలకు అదనంగా ఒక్కో సంఘ భవనానికి రూ.2 లక్షల మంజూరీని ఇస్తారన్నారు. గ్రామంలో 33/11కెవి సబ్‌స్టేషన్‌ను మంజూరుచేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. అలాగే ఇటీవల రూపొందించిన గ్రామపంచాయతీ చట్టంతో గ్రామ వ్యవస్థ రూపురేఖలు మారనున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగుకోసం 24 గంటల ఉచిత కరెంటును సరఫరా చేస్తోందని తెలిపారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే ఇంటింటికీ స్వచ్ఛ మైన తాగునీరు అందనుందన్నారు. ఒకవైపు అభివృద్ది మరోవైపు సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మార్కెట్ కమిటీఛైర్మెన్ రాజ్ మహ్మద్, అడెల్లి ఆలయ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ్ఛైర్మెన్ ఎర్రవోతు రాజేంధర్, మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు రమేష్, రాంరెడ్డి, టి.రమేష్, వెంకట్‌రాంరెడ్డి, తహశీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో గంగాధర్, మత్స్యశాఖ జిల్లా అధికారి గంగారాం, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి