తెలంగాణ

ఉన్నది పోయె...ఉంటున్నది కూలిపోయె...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 4: విజయ దశమి రోజున చేపట్టే ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా పూర్తవుతుందనుకున్నారు... పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టడంతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆశ పడ్డారు, కలలు కన్నారు... కానీ అదంతా పగటి కలగానే మిగిలిపోయంది. ఇది కాగజ్ మద్దూర్ గ్రామవాసుల దీనావస్థ. డబుల్ బెడ్‌రూం ఇల్లు ఎప్పటికి పూర్తవుతుందో కానీ, ప్రస్తుతం ఉన్న తాత్కాలిక గుడిసె కూలిపోయ గూడు లేని పక్షుల్లా జీవనం కొనసాగిస్తున్నారు. డబుల్ బెడ్‌రూం పథకంలో ఇల్లు వస్తుందని ఆశించిన తమకు అసలు నిలువ నీడ లేకుండా పోవడం దారుణమని కాగజ్ మద్దూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో దసరా పండుగ రోజున డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపనలు జరిపిన విషయం తెలిసిందే. ఆ రెండు గ్రామాల్లో ఉన్న ఇండ్లను జెసిబిలతో కూల్చివేసి పక్కా ప్రణాళిక ద్వారా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలోనూ స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చేతుల మీదుగా గంగిరెద్దుల వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించేందుకు అట్టహాసంగా భూమి పూజ నిర్వహించారు. తమ ఇళ్లను జెసిబిలతో కూల్చివేసి అక్కడే డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తామని భరోసా కల్పించారు. ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని సూచించడంతో పాటు కొద్ది దూరంలో వ్యవసాయ పొలంలో తాత్కాలిక గుడిసెలు వేసుకుని గత ఏడాది అక్టోబర్ నుంచి జీవనం సాగిస్తున్నారు. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలకు విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని నమ్మకం కల్పించారు. దీంతో ఉన్న ఫళంగా ఇండ్లను ఖాళీ చేసి పిల్లాజెల్లాతో గుడిసెల్లోకి మారిపోయారు. కానీ ఇప్పటివరకు జెసిబిల జాడ లేకపోగా, ఉన్న ఇండ్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయ. పూరి పాకల్లో అసౌకర్యాల మధ్య జీవనం అస్తవ్యస్తంగా సాగిస్తున్నా కనీసం వారిని పలుకరించే నాథుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు గుడిసెలన్నీ కూలిపోగా వడగళ్ల దెబ్బలతో గో సంరక్షకుల ఘోష చూడనలవికాని విధంగా తయారైంది. అప్పట్లో తాత్కాలిక గుడిసె నిర్మాణానికి ఒక్కో కుటుంబం సుమారు 10 నుంచి 15 వేల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్నారు. అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడలేక కొంతమంది తిరిగి తమ పాత ఇళ్లకు మకాం మార్చుకున్నారంటే పాలకులు, అధికారులు వారిని ఎంతటి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో స్పష్టమవుతోంది. కరెంటు లేక, నీటి ఇబ్బందులు పడలేక, వర్షాలు కురిస్తే కాలు కూడా మోపలేని తాత్కాలిక గుడిసెలను తిరిగి సురక్షితమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని నర్సయ్య అనే గోపాలకుడు వాపోతున్నాడు. మహిళలు మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులను శాపనార్థాలు పెట్టకుండా ఉండలేకపోతున్నారంటే వారు ఎదుర్కొంటున్న అవస్థలు ఏ స్థాయలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికారులు కూల్చివేస్తామన్న ఇండ్లను మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత నేత జగన్నాథరావు, మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిర్మించారని, తెలంగాణ ప్రభుత్వం ఆ ఇళ్ల వద్దనే డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తామంటే ఎంతో సంతృప్తి చెందామని, కానీ అది కార్యరూపం దాల్చకపోవడంతో తమను నమ్మించి మోసం చేసారని అర్థమవుతోందని నర్సింలు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కనీసం తమను పలుకరించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.