తెలంగాణ

యాదాద్రి తరహాలో నాచగిరి క్షేత్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 17: యాదాద్రి తరహాలో నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహ క్షేత్రాన్ని అభివృద్ధి చేయనుండగా, దేవాదాయ శాఖ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహ ఆలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను పరిశీలించడంతో పాటు సమీపంలోనే ఉన్న హల్దీవాగు సుందరీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆలయ నిర్మాణ ప్రణాళికలో భాగంగా రూ. 100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే ప్రతిపాదనలు తయారుచేయగా, 125్ఫట్ల ఎత్తుతో గరు డ, అంజనేయ స్వామి విగ్రహాల ఏర్పాటు, 100 వీఐపీ గెస్ట్‌హౌస్‌లు, 200 వసతిగృహాలు, నాచగిరి క్షేత్రం చుట్టూ 100 ఫీట్ల రోడ్డు వెడల్పుతో పాటు డివైడర్, వీధి దీపా ల ఏర్పాటు, విశాలమైన పార్కింగ్ ప్రదేశా లు, ఇంటర్నల్ రోడ్లు, కల్యాణమండపం, వేదపాఠశాలతో పాటు అర్చకులకు నివాస గృహాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, చైర్మె న్ చాంబర్, వేయిమంది భక్తులు కూర్చునే విధంగా కాన్ఫరెన్స్‌హాల్, 300 గదులతో షాపింగ్ కాంప్లెక్స్ తదితర పనులు అవసరమని ఆలయ ట్రస్టుబోర్డు చైర్మెన్ కొట్టాల యాదగిరి పేర్కొంటూ సీఎం కేసీఆర్‌కు సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్, ఆలయ డిజైన్‌ల ను అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ నర్సారెడ్డి, కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, గజ్వేల్ అబివృద్ధి అథారిటీ అధికారి హన్మంతరావు పాల్గొన్నారు.

చిత్రం..నాచగిరి ఆలయ సమీపంలోని హల్దీవాగు పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్