తెలంగాణ

రాజకీయాల ఊసెత్తని సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 17: రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా మెదక్ జిల్లాలో తూప్రాన్ డివిజన్‌ను ఏర్పా టు చేసిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొలిసారిగా రూ.11 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం 12:26 గంటలకు వేద పండితుల మంత్రోచాఛరణల మధ్య ఘనంగా ప్రారంభించారు. ముఖ్యంగా సీఎంకు పూర్ణకుంభంతో వేద పండితులు మేళతాళాలతో స్వాగతం పలికారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీలు ఫారుక్, పాతూరు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మైనింగ్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఐజి స్టీఫెన్ రవీందర్, డీఐజీ శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ చందనాదీప్తి, మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారిగా తూప్రాన్ డివిజన్‌లో ప్రవేశించి రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. దాదాపుగా 46 నిమిషాలు ఆసుపత్రి ప్రారంభానికి, పడకలను సందర్శించడానికి, నిర్మాణాలను పరిశీలించడానికి కేటాయించిన సీఎం మూడున్నర నిమిషాలు తూప్రాన్, గజ్వేల్ మండలాల విషయంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం తూప్రాన్, గజ్వేల్ మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలను ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్ కేవలం తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో మాత్రమే ప్రసంగించారు తప్పా రాజకీయ విషయాల్లో ఆసక్తి చూపలేదు. అనేక వరాలను సీఎం ఈ రెండు నియోజకవర్గాలకు ప్రకటించడం హర్షణీయమని తెరాస నాయకులు కొనియాడారు. సీఎం రాకముందు ఎలక్షన్‌రెడ్డి, సంయుక్త జిల్లా తెరాస అధ్యక్షులు మురళీయాదవ్, నర్సింహారెడ్డి, అధికారులు సభా వేదికలను పర్యవేక్షించారు. మెదక్, సిద్దిపేట కలెక్టర్లు, ఐజీ స్టీఫెన్ రవీందర్, డీఐజీ శివశంకర్‌రెడ్డి, ఎస్పీ చందనాదీప్తి సీఎం పర్యటన వేదిక ప్రాం గణంలో అప్రమత్తంగా పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాలను పకడ్బందిగా నిర్వహించారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని పోలీస్ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. చీమ దూరకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక దశలో సంగారెడ్డి జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. జర్నలిస్టులను ఎవరినీ కూడా ఆసుపత్రిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ఆసుపత్రిని ప్రారంభించే సమయంలో పోలీసులు ఎలక్ట్రానిక్ మీడియాకు అం తరాయం కలిగించారు. అక్కడ నుండి సీఎం ఆసుపత్రిలో ప్రవేశించినప్పుడు మీడియాను అనుమతించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రి కట్టడాల ను పరిశీలించారు. రెండవ అంతస్తులో ఉన్న 50 పడకలను సందర్శించారు. ఆ తరువాత డాక్టర్లతో చర్చించారు. డాక్టర్ పిసి.శేఖర్ సిబ్బంది కొరత విషయంలో సీఎం కేసీఆర్‌కు వివరించారు. వాటన్నింటినీ త్వరలో పూర్తి చేసుకోవాలని సీఎం ఆయనను ఆదేశించారు. ఆ తరువాత ప్రజా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడున్న ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభివాదం తెలిపారు.
చిత్రం..తూప్రాన్‌లో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం కేసీఆర్