తెలంగాణ

రైతు సమన్వయ సమితికి రూ.4వేల పంపిణీ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం పథకం రైతు సమన్వయ సమితుల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం అమల్లో బ్యాంకుల ప్రమేయం ప్రత్యక్షంగా లేకుండా చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పరోక్షంగా మాత్రం బ్యాంకుల అవసరం ఉంటుంది. రాష్ట్రం మొత్తంలో దాదాపు 10 వేల గ్రామ రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి. దాదాపు 1.60 లక్షల మంది రైతులు ఈ సమితుల్లో సభ్యులుగా ఉన్నారు. అలాగే మండలస్థాయిలో మండల రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లా స్థాయి సమితుల ఏర్పాటు ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు చేస్తారు. రాష్టస్థ్రాయి సమితిని ముఖ్యమంత్రి స్వయంగా నియమిస్తారు. రైతులకు పంటల పెట్టుబడి కింద 2018 ఖరీఫ్ (వానాకాలం) నుండి ఎకరానికి నాలుగువేల రూపాయలు పెట్టుబడిగా ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ పెట్టుబడి ఏ విధంగా రైతులకు అందించాలన్న అంశంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇటీవల ఒక సర్వే చేశారు. మెజారిటీ సంఖ్యలో రైతులు చెక్కుల రూపంలో ఈ సాయం అందించాలని కోరారు.
చెక్కుల ద్వారా నాలుగువేల రూపాయల పంపిణీ జరిగినా, నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించినా, అది రైతు సమన్వయ సమితుల ద్వారా చేస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామస్థాయి రైతు సమన్వయ సమితులు బలంగా ఉండాలంటే రైతులతో వారికి అవినాభావ సంబంధం ఉండాలి. ప్రస్తుతం విత్తన సబ్సిడీ, వ్యవసాయ యంత్రాల సబ్సిడీ తదితర రూపాల్లో రైతులకు ఇస్తున్న సబ్సిడీలు వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం ద్వారా చేరుతున్నాయి. ఇక నుండి ఈ కార్యక్రమాలు కూడా రైతు సమన్వయ సమితుల ద్వారా చేసే అంశంపై పరిశీలిస్తున్నారు. రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి రెండు లాభాలున్నాయి. ఈ సమితుల్లో టిఆర్‌ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పాటు కోసం శ్రమించిన టిఆర్‌ఎస్ కార్యకర్తల సేవలు సామాజికాభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో వాడుకుంటే తప్పేమిటన్న చర్చను కూడా లేవనెత్తారు. నాలుగువేల రూపాయల పంపిణీ ద్వారా రైతు సమన్వయ సమితులు పనిచేసినట్టు అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న కీలక పథకం గ్రామాల్లో ఈ సమితుల ద్వారా అమలవుతుందన్న ప్రచారం జరుగుతుంది. దాని వల్ల రాష్ట్రంలో ఉన్న దాదాపు 71 లక్షల రైతు కుటుంబాలు, రైతు కుటుంబ సభ్యులతో కిందిస్థాయి పార్టీ శ్రేణులకు అవగాహన ఏర్పడుతుంది. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం సత్ఫలితం ఇస్తుందని పాలకులు భావిస్తుండటం వల్ల రైతు సమన్వయ సమితుల ద్వారానే నాలుగువేల రూపాయల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.