తెలంగాణ

బ్యాంకుల్లో నగదు నిల్వలు అందుబాటులో ఉంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘సాగుగు పెట్టుబడి సాయం పథకం’లో భాగంగా బ్యాంకుల్లో తగినంత నగదు నిల్వలను అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే మే నెల నుంచి తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇచ్చే విధంగా పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. రాష్ట్రంలో 71లక్షల 75వేల మందికి పైగా రైతులకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మే ఒకటినుంచి పది రోజులపాటు ప్రతి గ్రామంలోనూ ప్రజా ప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. ఈ అంశంపై గతంలో బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో తమ వద్ద అంత పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉండే పరిస్థితి లేదని,బ్యాంకుల్లో అదనపు నగదు కోసం కేంద్రాన్ని సంప్రదించాలని బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రైతులు బ్యాంకుల్లో చెక్కులు వేసే సమయానికి తెలంగాణ బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉండేవిధంగా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. దీనితోపాటుగా సూక్ష్మ, బిందు సేద్యానికి తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, వీటికి సంబంధించిన పరికరాలను జీఎస్టీలో 18శాతం పన్నుల జాబితాలో ఉంచడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పన్నుల జాబితాను సరిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్టు మంత్రి పోచారం తెలిపారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సమావేశం ద్వారా వచ్చే బడ్జెట్‌పై ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ప్రభుత్వ ప్రధాన విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులున్నారు.

చిత్రం..ఢిల్లీలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన
రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి