తెలంగాణ

ఇక బైక్ అంబులెన్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: అత్యవసర వైద్య సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న 108, 104 అంబులెన్స్ వాహనాలకు అదనంగా ‘102’ ద్విచక్ర వాహన అంబులెన్స్‌లనూ ప్రభుత్వం బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ‘102’ ద్విచక్ర వాహన వైద్య సేవలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. కెసిఆర్ కిట్స్ పథకం అమలు తర్వాత ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కుదిరిందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వైద్య సేవలను మరింత విస్తృత పరుస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇక నుంచి వైద్య, ఆరోగ్యశాఖకు మరిన్ని నిధులు అవసరం అవుతాయన్నారు. వచ్చే బడ్జెట్ 2018-19లో వైద్య, ఆరోగ్యశాఖకు ఎక్కువ నిధులు కేటాయించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రస్తుతం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని, ప్రాజెక్టులు పూర్తయ్యాక వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యత, ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు. గతంలో ప్రజా వైద్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, డబ్బులున్న వారు పెద్ద ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటుండగా, పేద ప్రజలకు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రులే పెద్ద దిక్కన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని రకాల వైద్యశాలలో సదుపాయాలు పెంచామని, 108, 104, 102 సర్వీసులను మరింత మెరుగు పర్చామన్నారు. కెసిఆర్ కిట్స్ వంటి గొప్ప పథకాలు అమలు అవుతున్నాయని, ప్రభుత్వ చిత్తశుద్ధికి తోడు వైద్య అధికారులు, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. దీని వల్ల ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరగడం వల్ల పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వైద్య, ఆరోగ్యశాఖ భవిష్యత్ కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. పేద వారికి మెరుగైన వైద్యం, మంచి విద్యకు మించిన ప్రాధాన్యం మరొకటి లేదన్నారు. వైద్యశాలల నిర్వహణను వికేంద్రీకరణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగించి వారికే నిధులు ఖర్చు చేసే అధికారాన్ని ఇస్తామన్నారు.

చిత్రాలు..హైదరాబాద్‌లో మంగళవారం ద్విచక్ర అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు