తెలంగాణ

సంక్షేమ పథకాలు భేష్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పనితీరు చాలా బాగుందని బ్రిటీష్ హై కమిషనర్ అండ్రో ఫ్లెమింగ్ కితాబునిచ్చారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించడం నిజంగా అద్భుతమని పేర్కొన్నారు. గురువారం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌లో ఆయన స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌తో కలిసి పర్యటించారు. చినముల్కనూర్‌లో అడుగుపెట్టిన బ్రిటీష్ హై కమిషనర్‌కు గ్రామస్తులు పుష్పగుచ్చాలను అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇంటి యజమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం గ్రామాభివృద్ధిపై గ్రామస్తుల ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగు నీరందించడం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం, రైతులకు పెట్టుబడి కోసం ఏటా రూ.8వేలు అందించడం, 24గంటలు కరెంట్ ఉచితంగా ఇవ్వడం పట్ల అండ్రో ఫ్లెమింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, రుణ మాఫీ, పెట్టుబడి కోసం రూ.8వేలు, 24గంటల కరెంట్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాల అమలు తీరు భేష్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. అం తకుముందు అండ్రోఫ్లెమింగ్ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ, హుస్నాబాద్, సైదాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో సుడిగాలిలా పర్యటించారు. పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు సందర్శించారు. ముల్కనూర్ డెయిరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమల్ల శేఖర్ పటేల్, తహాశీల్దార్ గడ్డం సుధాకర్, ఎంపిడిఓ ఖాజామొయినొద్దీన్, సర్పంచ్ మకుటం రాజయ్య, ఎంపీటీసీ సభ్యుర్యాలు సంగీత, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..చినముల్కనూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న బ్రిటీష్ హై కమిషనర్