తెలంగాణ

16 మంది కానిస్టేబుళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జనవరి 18: 2011లో జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో అభ్యర్ధి బదులు మరొకరు రాసిన కేసు విచారణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మంది కానిస్టేబుళ్లు బయటపడటంతో బుధవారం రాత్రి హైద్రాబాద్ సీఐడీ పోలీసు అధికారులు అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిల్లో ఒకేసారి దాడులు నిర్వహించి 16 మందిని అరెస్టు చేశారని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. మిర్యాలగూడ పోలీస్ సబ్‌డివిజన్‌లో మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పని చేస్తున్న దొంగరి సందీప్, వాడపల్లి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న నాగరాజు యాదవ్‌ను సీఐడీ అధికారులు, సిబ్బంది అరెస్టు చేశారు. ఇతను పెన్‌పాడు మండలం దోసపాడు గ్రామానికి చెందిన వాడు. అదే విధంగా వాడపల్లిపోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నాగరాజు నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన వాడు. సీఐడీ పోలీసు అధికారులకు కానిస్టేబుల్ పరీక్ష రాసిన వారే ఫిర్యాదు చేశారని తెలిసింది. ఫిర్యాదు అందినందున పరీక్షకు హాజరై అభ్యర్ధి సంతకం పెట్టిన వాడి సంతకం, అదే విధంగా ఉద్యోగంలో చేరిన వాడి సంతకాన్ని టాలీ చేయగా కలవకపోవడంతో విచారణ వేగవంతం చేసి అరెస్టులు చేశారు. మొత్తం మీద సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారన్న ఆరోపణలపై కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వీరిపై సెక్షన్ 420, 419, 470 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు అయిన వారి గురించి పోలీస్‌స్టేషన్‌ల ఇన్‌స్పెక్టర్లు ఆయా జిల్లాల ఎస్‌పీలకు సమాచారం అందించారు. ఇక వారిని సస్పెండ్ చేయడమే తరువాయి.