తెలంగాణ

బీసీలు సంపద సృష్టికర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జనవరి 18:సకల సంపద సృష్టికి వెనుకబడిన, అణగారిన కులాలవారే కార కులని బీసీ కమిషన్ చైర్మన్ బి.రాములు అన్నారు. నాగార్జునసాగర్‌లో గురువారం ఆచార్య కొండాలక్ష్మణ్‌బాపూజీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వెనుకబడిన కులాల లో ఎబిసిడిగా పునర్‌వర్గీకరణకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. వెనుకబడిన కులాల వారికి 50శాతం రిజర్వేషన్ పెంచేవిధంగా ప్రభుత్వం ప్రయ త్నం చేస్తుందన్నారు. బాపూజీ నిరంతరం అణగారిన కులాలవారికి సేవలందించిన వ్యక్తి అన్నారు. అటువంటి మహానీయ వ్యక్తి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బాపూజీ వేల మంది నాయకులను తయారు చేశారని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలను కేటాయించడంలో భాగంగా కులవృత్తుల ఆధారంగా 350కోట్లు కేటాయించామన్నారు. బీసీలు అన్ని రంగాలలో సాధికారిత సాధించే విధంగా ప్రభుత్వం పలు పథకాలు తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనాభా నిష్పత్తి ఆధారంగా డేటా సేకరిస్తున్నామని తెలిపారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో రిజర్వేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొండలక్ష్మణ్‌బాపూజీ ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, ఆయన తెలంగా ణకు స్ఫూర్తి అని కొనియాడారు. సాగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు తన పూర్తి సహకారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బాపూజీ గురించి తెలుసుకోవడమంటే మన చరిత్ర, గతం, భవిష్యత్ గురించి తెలుసుకోవడమే అని అన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న్న బీసీ కమిషన్ చైర్మన్ రాములు