తెలంగాణ

భారతీయ గ్రంథాలలో అపార విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, జనవరి 18: ప్రాచీన భారతీయ గ్రంథాలలో అపారమైన జ్ఞానం నిక్షిప్తమై ఉందని డిఆర్‌డిఓ పూర్వ శాస్తవ్రేత్త డాక్టరు ప్రహ్లాద అన్నా రు. వాటిని సరైన రీతిలో అర్థం చేసుకుని అమలు పరచడంలో మనం విఫలమవుతున్నామని ఆయన ఆవేదన చెందారు. పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని గీతం విశ్వవిద్యాలయంలో గురువారం ఏరోస్పేస్ టెక్నాలజీ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేసారు. మన పూర్వికులు పుష్పక విమానం వాడినట్లు పురాణాలలో ఉటంకించినా దానిని ఆధారాలతో నిరూపించలేక పోతున్నామన్నారు. మహా కురుక్షేత్ర సం గ్రామాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినట్టు, సౌర విద్యుత్‌ను ఉపయోగించినట్టు గ్రంథాలలో రాసి ఉన్నప్పటికీ నిరూపించడానికి ఎలాంటి ఆస్కారం లేదని ఆయన అన్నారు. పురాతన విషయాలను సాంకేతికంగా నిరూపించక పోవడంతో ప్రస్తుత విద్యార్థినీ విద్యార్థులు అవగతం చేసుకోలేక పోతున్నారన్నారు. విమాన పైలట్ ఎటువంటి ఆహారం భుజించాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయాలు పురాతన గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయన్నారు. ఈ కాలం పిల్లలకు వాటిపై అవససరమైన అవగాహన కల్పించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో గీతం కళాశాల ప్రొఫెసర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గీతం విశ్వవిద్యాలయంలో ఉపనయిసిస్తున్న డిఆర్‌డిఓ పూర్వ శాస్తవ్రేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు