తెలంగాణ

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 18: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయా ణి కులు క్షేమంగా బయటపడ్డారు. వివరాలలోకి వెళ్తే...నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ కుమారుడు రామచంద్రారెడ్డి, కుమార్తె వాసంతి కర్ణాటకలో మెడిసిన్ చదువుతున్నారు. వారిని పంపించేందుకు కారులో బయలుదేరారు. చిన్నాయన కుమా ర్తె లక్ష్మీప్రియాంక చిన్నపిల్లల వైద్యురాలుగా డిగ్రీ పూర్తి చేసింది. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పూణెలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు లక్ష్మీప్రియాంక అక్క పద్మజతో పాటు కారులో బయలుదేరింది. కారులో హైదరాబాద్‌కు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పంతంగి గ్రామం వద్ద అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ ఎక్కి రోడ్డు అవతలవైపుకు రాంగ్ రూట్‌లోకి దూసుకువెళ్లింది. హైదరాబాద్ వైపుకు వస్తున్న మరో బస్సును ఢీకొట్టి వెనక నుంచి వస్తున్న పద్మజ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ (50), లక్ష్మిప్రియాంక (28), కుమార్తె వాసంతి, కుమారుడు రామచంద్రారెడ్డి, కారు డ్రైవర్ కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించగా కట్ట పద్మజ మరణించింది. పరిస్థితి విషమంగా ఉందని లక్ష్మీప్రియాంకను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాసంతి, రామచంద్రారెడ్డిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు నుజ్జైంది. ఆర్టీసీ బస్సు లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.సంఘటనలో ప్రయాణఇకులు సైతం స్వల్పంగా గాయపడ్డారు. మహిళల మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..మరణించిన కట్ట పద్మజ, కట్ట లక్ష్మీప్రియాంకల మృతదేహాలు