తెలంగాణ

సర్పంచుల ఎన్నికకు పరోక్ష పద్ధతిని అంగీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రప్రభుత్వం కొత్తగా రూపొందించిన ప్రవేశపెట్టనున్న పంచాయితీరాజ్ సవరణల చట్టాన్ని తిరస్కరిస్తున్నట్లు, స్థానిక సంస్థల అధికారాలను కబళించే విధంగా చట్టంలోని అంశాలు ఉన్నాయని, ఈ అంశంపై జనంలోకి వెళతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశం ఈ చట్టాన్ని వ్యతిరేకించేందుకు విధివిధానాలను ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, 27వ తేదీన అన్ని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అంశంపై కార్యకర్తలు, ప్రజలతో సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక ఆర్‌డీవోలకు వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు. అనంతరం జనవరి 30వ తేదీన జిల్లా కలెక్టర్లను కలిసి పంచాయతీరాజ్ చట్టం సవరణలు వ్యతిరేకిస్తూ వినతిపత్రాలు ఇస్తామన్నారు. సర్పంచ్ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించడానికి తమ పార్టీ అంగీకరించదన్నారు. ఈ సమావేశం తర్వాత విలేఖర్లతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలను బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు అప్రజాస్వామికమన్నారు. దీనివల్ల అవినీతి పెచ్చుమీరుతుందన్నారు. ఈ ఎన్నికలను ముందుగా నిర్వహించడం కుట్ర అన్నారు. ఇప్పుడున్న సర్పంచ్‌ల పదవీ కాలం ఆగస్టు 1వ తేదీతో ముగుస్తుందన్నారు. 83 గ్రామీణ అసెంబ్లీ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదన్నారు. స్ధానిక సంస్ధలకు నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను కూడా మంజూరు చేయడం లేదన్నారు. పంచాయతీల ఆర్థిక స్థితిగతులపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయితీల్లో వౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత కె. జానారెడ్డి, సీనియర్ నేత మహమ్మద్ అలీ షబ్బీర్, పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చిన్నారెడ్డి, పీసీసీ ఆఫీసు బేరర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

చిత్రం..గాంధీభవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి