తెలంగాణ

అందుబాటులో లేకపోతే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, మే 5: వర్షాకాలం సమీపిస్తున్నందున మిషన్ కాకతీయ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు వీలుగా ఇరిగేషన్ అధికారులు తమతమ కార్యస్థానాల్లోనే ఉండాలని, ఎవరైనా అందుబాటులో లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలాఖరు నాటికి మిషన్ కాకతీయ మొదటి, రెండవ విడత పనులను పూర్తి చేయించాలని ఆయన గడువు విధించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పర్యటనకు హాజరైన సందర్భంగా గురువారం ఆయన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాస గృహంలో మిషన్ కాకతీయ పనులపై సమీక్ష జరిపారు. కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ, మిషన్ కాకతీయతో పాటు ఇరిగేషన్ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు విధిగా కార్యస్థానాల్లోనే ఉండి పనులు జరిపించాలని ఆదేశించారు. సెల్‌ఫోన్ ఆధారంగా అధికారులు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తామని, ఎవరైనా లోకల్‌గా లేనట్టు తేలితే వారి హెచ్‌ఆర్‌ఎలో కోత విధించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నిజాంసాగర్ ప్రధాన కాల్వ డిస్ట్రిబ్యూటరీల ఆధునికీకరణ కోసం గతంలో మంజూరు చేసిన నిధులే కాకుండా అదనంగా మరో 110 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విలేఖరుల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, కలెక్టర్ యోగితారాణా, జె.సి రవీందర్‌రెడ్డి, బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.