తెలంగాణ

సంపద పెరగడంలో మీ పాత్ర ఏమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల అభివృద్ధి, కొత్తగా పరిశ్రమల స్థాపన, ప్రజల సంపద పెరగడంలో మీ పాత్ర ఏముందీ? అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. హైదరాబాద్ పరిసరాల్లోని మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటీ?, మీరు చేసిన అభివృద్ధి ఏమిటీ? అని సురవరం శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగానే ఇంత కాలం అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్, నగర శివారులో పెరిగిన సంపదను మిగతా జిల్లాలకు ఏమైనా పంచుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అంతా తానే చేశానని చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రైవేటు రంగానికి, కోటీశ్వరులకే సహాయపడ్డారు తప్ప పేదలకు ఒక్క రూపాయి ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగు రాఅష్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నదని ఆయన విమర్శించారు. దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేస్తే మంచిదేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
అరబ్ దేశాలను ఆక్రమించాలని యత్నిస్తున్న ఇజ్రాయిల్ ప్రధానితో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ భాయి-్భయి అని చెప్పడంతో మోదీ హిందుత్వ ఆకాంక్ష ఏమిటో తెలుస్తున్నదని సురవరం విమర్శించారు. దీని వల్ల ఎటువంటి సంకేతాలు వెళతాయో ఆలోచించుకోవాలన్నారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే ప్రధాని మోదీ లోక్‌పాల్, అవినీతి, న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జిఎస్‌టి ఎన్ని సార్లు మారుస్తారని ఆయన ప్రశ్నించారు. ఒకే దేశం - ఒకే పన్ను అనే నినాదం బాగానే ఉంది కానీ అశాస్ర్తియంగా చేపట్టి ప్రజల వెన్ను విరుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
మహిళా చట్టాల కోసం
పోరాటలు: చాడ పిలుపు
తెలంగాణ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి అధ్వర్యంలో జరిగిన వర్క్ షాప్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రసంగిస్తూ మహిళా చట్టాలు, హక్కుల అమలు కోసం సమరశీల పోరాటాలు సాగించాలని మహిళలకు పిలుపునిచ్చారు. సమాఖ్య అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షత వహించగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఇతర నాయకులు పి. సృజన, ఎన్. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ ప్రసంగిస్తూ మహిళా సమాఖ్య రెట్టింపు ఉత్సాహంతో, పట్టుదలతో ఉద్యమాలు కొనసాగించాలని చెప్పారు.
టి-మాస్ డిమాండ్
సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టి- మాస్) రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి