తెలంగాణ

నియామకాల అనంతరం పోలీసులకు వారాంతపు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 19: పోలీసు శాఖలో నియామకాలు పూర్తయ్యాక, పోలీసులకు వారాంతపు సెలవును అమలుచేసే ప్రయత్నం చేస్తామని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి స్పష్టం చేసారు. శుక్రవారం సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవును నియామకాలు పూర్తి చేసాక అమలు చేసే యోచనలో ఉన్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించే విధంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 800 పోలీసు స్టేషన్లు ఉన్నాయని, ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఒకే రకమైన సేవలు లభిస్తాయన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని తీసుకువచ్చేందుకు స్నేహపూర్వక పోలీసులుగా సేవలందిస్తామన్నారు. సిబ్బందిలో కూడా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నేర రహిత రాష్ట్రంగా గుర్తింపు లభించేలా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసారు. పోలీసులు ఆది, సోమవారం అనకుండా, పండుగా, పబ్బం లేకుండా నిరంతరం ప్రజలతో భాగస్వామ్యమై మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ అంటే ఓ దేవాలయంగా ప్రజలు భావించేలా పోలీసులు పని చేయాలని సూచిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపడినప్పుడే ప్రజలకు సేవలు చేస్తారని, ఆ దిశలో శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు నిలయమైన రాష్ట్రంలో అదే తరహాలో పోలీసు శాఖపై నమ్మకం కలిగేలా కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో పశ్చిమ మండలం ఐజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, చందనాదీప్తి, అన్నపూర్ణ పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి