తెలంగాణ

స్కూలు బస్సు నుంచి జారి పడి విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, జనవరి 20: పాఠశాల యాజమాన్యం,డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్సులోని నుంచి పడి విద్యార్థిని మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాహెబ్‌నగర్‌లోని గాయిత్రినగర్‌లో నివాసం ఉంటున్న నాగయ్య, పావనిల కూతురు అంజలి (7) వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది.ప్రతి రోజు స్కూల్‌కు స్కూల్ బస్సులో వెళ్తుంది. శనివారం నాడు ఉయదం సమయంలో బస్సు ఎక్కి స్కూల్‌కు వెళ్తూ బస్సులో డ్రైవర్ ప్రక్కనే నిలబడింది. బస్సులో అటెండర్ లేక పోవడంతో విద్యార్థులు అందరు నిలబడి ఉన్నారు. బస్సు డ్రైవర్ ఒక్క సారిగా సడెన్ బ్రేకు వేశాడు. దీంతో వేగంగా వెళుతున్న బస్సులో నుండి అంజలి ముందు డోర్ నుండి క్రిందపడిపోయింది. తలకు త్రీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంజలిని చూసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈవిషయం తెలుసుకున్న అంజలి తల్లి దండ్రులు ఆసుపత్రికి చేరుకుని మృతి చెందిన కుమార్తెను చూసి కన్నీరుమున్నీరు అయ్యారు.