తెలంగాణ

మెదక్ ఎస్పీ సుమతికి ఫిక్కీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 5: శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి జిల్లా సేనలను ముందుండి నడిపిస్తూ సత్ఫలితాలు సాధించిన మెదక్ జిల్లా ఎస్పీ బడుగుల సుమతికి కేంద్ర ప్రభుత్వం అందజేసే ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి చౌదరి చేతుల మీదుగా ఎస్పీ సుమతి ఈ అవార్డును అందుకున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రధానంగా మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను అరికట్టడానికి వినూత్న తరహాలో చర్యలు చేపట్టారు. ఫేస్‌బుక్, వాట్సప్, షీ బృందాల ఏర్పాటు, హైవే పెట్రోలింగ్ తదితర చర్యల ద్వారా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. బయటకు చెప్పుకోలేని వేధింపులు, ఇతర ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోలేక జీవితంపై విరక్తి చెంది అర్ధంతరంగా తనువు చాలించాలనుకునే వారి కోసం చేతన పేరుతో జిల్లాలో కౌనె్సలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా చేతన కౌనె్సలింగ్ కేంద్రాల్లో దాదాపు 1100 పైచిలుకు మంది సమస్యలను పరిష్కరించి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ కింద హైదరాబాద్, మెదక్ పోలీసులను ఎంపిక చేసారు. ఇందులో మెదక్ ఎస్పీ సుమతికి ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపిక చేసారు.
బాధ్యత పెంచింది
ప్రజాసేవే కర్తవ్యంగా భావించి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ సుమతి ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ తెలిపారు. తనకు లభించిన స్పెషల్ జ్యూరీ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజాసేవకు అంకితమై మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న హోంగార్డు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు సమష్టిగా కృషిచేయడం వల్లే ఈ అవార్డు లభించిందని, ఇది సమష్టితత్వానికి నిదర్శనమన్నారు. చేతన కేంద్రాల ద్వారా అభాగ్యులకు అవగాహన కల్పిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం కేంద్ర మంత్రి చౌదరి చేతుల మీదుగా ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డును
అందుకుంటున్న మెదక్ ఎస్పీ బి.సుమతి