తెలంగాణ

క్రమబద్ధీకరణ ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంమర్ 22: రాష్టవ్య్రాప్తంగా అనుమతిలేని నిర్మాణాలు, అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్), ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పథకాలపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. పథకాలపై దాఖలేన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, తదుపరి విచారణ జనవరి 27న జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల ప్రక్రియను నిలుపుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయతే, దరఖాస్తులు మాత్రం యథావిధిగా స్వీకరించేందుకు అనుమతించింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు అక్రమ నిర్మాణాలను అనుమతించడంవల్ల నగర స్వరూపం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందంటూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెస్ హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడంవల్ల నగర లేఅవుట్ మారిపోయి భవిష్యత్‌లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు చేసిన ఫోరమ్ ఫర్ గుడ్ అవర్నెస్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇలావుండగా బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆశించింది. ఇప్పటికే అనుమతిలేని భవనాల యజమానులు, అనధికార లేఅవుట్లు చేసిన రియల్టర్లు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకోవడానికి నెలాఖరు వరకు మాత్రమే గడువుండగా, మరో వారంలో గడువు ముగియనున్న తరుణంలో హైకోర్టు ‘స్టే’ విధించడం ప్రభుత్వానికి, దరఖాస్తుదారులకు షాక్ ఇచ్చినట్టయ్యంది. క్రమబద్ధీకరణకు ఇప్పటికే డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారులు ప్రభుత్వం తిరిగి వాటిని చెల్లిస్తుందా? లేదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.