తెలంగాణ

కాశీలో వైభవంగా సంక్రాంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: కాశీలోని శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమంలో ఆదివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగినట్లు కాశీ తెలుగు సమితి తెలిపింది. కాశీలోని తెలుగు వారంతా తెలుగుదనం ఉట్టిబడేటట్లు బట్టలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలకు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్ పోటీలు, మహిళలకు మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి వంటి ఆటలను ఆడించి అలరించారు. సంక్రాంతి వేడుకలను పెద్దలు, పిల్లలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఆటపాటల్లో విజేతలైన పలువురు మహిళలకు కాశీ తెలుగు సమితి బహుమతులను అందజేసింది. వేడుకల సందర్భంగా పాల్గొన్న తెలుగు వారందరికి విందు భోజనం ఏర్పాటు చేసినట్లు సమితి కార్యదర్శి వివి సుందరశాస్ర్తీ ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్రం..విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న దృశ్యం