తెలంగాణ

వైద్య శాఖకు పెరగనున్న బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: వైద్య ఆరోగ్య శాఖకు 2018-19 సంవత్సరంలో ఎక్కువ నిధులు సంపాదించేందుకు ఈ శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు చేరువ అయిందని, పేద ప్రజల అవసరాలను తీరుస్తోందని, అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అందువల్ల ఈ శాఖకు ఎక్కువ నిధులు కావాలని లక్ష్మారెడ్డి కోరుతున్నారు. 2017-18 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు 5920 కోట్ల రూపాయలు కేటాయించగా, అంతకు ముందు సంవత్సరం (2016-17) 5585 కోట్లు కేటాయించారు. 2018-19 సంవత్సరంలో ఈ నిధులను మరింత ఎక్కువగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
కెసిఆర్ కిట్లకు గిరాకీ పెరిగింది. 102, 108 అంబులెన్స్ బైక్‌లు వైద్య శాఖకు మంచిపేరుతెచ్చాయి. ప్రసవాలకు ప్రస్తుతం సర్కారు దవాఖానాలకే వస్తున్నారు. మొత్తం ప్రసవాల్లో 50 శాతం ప్రసవాలు సర్కారు దవాఖానాల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
నాణ్యమైన మందులు ఇవ్వడం వల్ల ప్రజలు సర్కారు దవాఖానాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిస్థితిలో ఖర్చు పెరిగిపోయింది. దాంతో వైద్య ఆరోగ్య శాఖకు వచ్చే ఏడాది ఎక్కువ నిధులు అవసరం అవుతాయని అంచనావేశారు. ఈ అంశంపై మంత్రి లక్ష్మారెడ్డి ఈ శాఖకు చెందిన వివిధ విభాగాల అధిపతులతో సమావేశాలు జరిపి, పరిస్థితి సమీక్షిస్తున్నారు. అన్ని విభాగాలతో సమీక్ష తర్వాత సమగ్ర నివేదిక రూపొందించి, వైద్య శాఖ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఎంత అవసరం అవుతుందో అంచనావేసి ఆర్థిక శాఖకు పంపించాలని భావిస్తున్నారు. 2017-18 సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే అదనంగా 20 శాతంపైగా నిధులు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.